Thursday, February 3, 2011

అమ్మయ్‌ గోరూ.

అమ్మయ్‌ గోరూ.


అమ్మయ్‌ గోరూ.


మరండీ ఈ రోజుల్లో పెపెంచకం లో
సానా గొడవలు మతకల్లోలా వల్లే జరుగుతున్నాయండి.
అసలండి ఈ మతం , అదేననండి ఇంగ్లీసులో రిల్జనంటారు కదాండి,అదండి.

ఈ రిల్జన్‌ అనేది ఈ పెపంచకంలో
ఎలా పుట్టిందీ అని
అలోసిత్తేనండి.అది సానా ఇసిత్రంగా ఉంటాదండి.

సానామంది అంత్రోపాల్జిస్ట్లు సానా రకాలుగా సర్చించారండి.
ఏటంటేనండి రాళ్ళూ రప్పల్లో
జంతువుల్ని యేటాడుతూ
బతికిన మనిసి రిల్జన్‌ లోకి ఎలా వచ్హాడనండి.

ఆయ్‌. అమ్మయ్‌ గోరూ
మీరింటికెల్లడానికి
ఇంకా సానా రోజులు
టైముండి గాబట్టి
ఈ కతేంటో సూద్దామండి మరి.

ఏమంటారండమ్మయ్‌ గోరూ ?!

‘అలాగే’

ఆయ్‌.మరయితే ఇనండిక.
ఓరేయ్‌ సత్తిగా .అమ్మయ్‌ గోరికి మరో రెండు బొండాలు పట్రారా.

ఆయ్‌.అమాయ్‌ గోరూ మీరు ట్రాతో
బొండాలు తాగుతూ ఉండండి
నేను రిల్జన్‌ గురించి సెప్తానండి.


మరండి ఆ రోజుల్లో మొగ మనిసి జీంసు పేంటుతో
యేటకు పోయేవాడని సెప్పను కదాండి.
అట్టా యెటాడి యేటాడి అలిసి పోయి అలా
సెట్టుకింద కాసేపు ఓ కునుకు తీసేవోడండి.
సందాల మాట్లు తిరిగోచ్హేసి ఇంటిదానికి
యేటాడి తెచ్హినయ్యన్నే ఇచ్హేత్తే ఇంటిదేమో
అందరికీ పంచేదండి.అందరూ తినేసి రాత్తుల్లు
గుహల్లోకి పోయి కునుకు తీసేవోరండి.

ఇప్పుడంటె రాత్తుల్లు మనుసులు పాట్లల్లో
నిద్రోతున్నరనుకోండి.
అయినా పాట్లకీ గుహలకీ
పెద్ద తేడా లేదనుకోండి మరి.

అలా కునుకు తీత్తున్నపుడు అలిసిపోయిన దానిమీద
బాగా మత్తు నిద్రలొకి జారుకొన్నపుడు
జోతిలచ్హిమి ,జయమాల లాంటి
వోల్లదగ్గరకెల్లి డాంసు కడ్తున్నట్టు
మాంఛి కలలు కనేవోడండి.

తీరా మెలుకువొచ్హి సూతే జోతిలచ్హిమీ
జయమాల గట్టా ఎవరూ
కనపడేవోరు కాదండి.

ఒక్కోసారి తాను ఇంతకు ముందు ఎప్పుడూ
యెల్లని సోటికెల్లినట్టూ
ఎప్పుడూ సెయ్యని పనులు
సేసినట్టూ కలల్లో సూసేవోడండి

మరి ఇయన్నే సూసి సూసి ఆ రోజుల్లొ
ఆది మానవుడు ఆలోసనలో పడతాదండి

ఎంటి సెప్మా. మనుసుల్లొ ‘ఆత్మ’అనేది ఎదో
ఉండి ఉండాలి.నేను పడుకున్నప్పుడు నాకు
సెప్పపెట్టకుండా
అది సికారుకెల్లి ఎక్కడెక్కడో తిరిగోత్తోండి.అనండి.

మనుసులకి జొరం ఎందుకోత్తోంది?
మనుసుల్కి కలల్లో కనిపించేయేమిటి?
మనుసుల్కి నిద్రా,మెలుకువా,సావు,పుట్టుక
ఎందుకొత్తున్నాయ్‌ ?
ఎవరు కలుగసేత్తున్నారు?
ఇలా కాలీ దొరికనప్పుడల్లా అలోసిత్తా ఉండెవోడండి.

అట్టాగే మనిసి సనీపోయినపుడు ‘ఆత్మ’
పర్మింటు గా ఎక్కడకో ఎల్లి పోయిండాలి
అని అలోసన లో పడ్డాడండి.

అట్టాగే బాగా గాలదీ ఏసినపుడూ
ఉరుములూ మెరుపులతో వానా గట్టా కురిసినపుడూ
ఈటన్నిటిలోనూ నాకన్న ఏదో బాగ బలమైన
‘ఆత్మ ’ ఉండుండాలని అనుకునేవోడండి.

ఈ ఆత్మలన్నీ మనుసుల్లగే అలోసిత్తాయనీ,
సూత్తాయనీ,పనులు సేత్తాయనీ అనుకునేవోడండి.

కమేనా పకృతిలో తనకి
తెలియందేన్నయినా సరే
ఎదొక ‘ఆత్మ’(సోల్‌ ) తో ముడి పెట్టేటం అలవాటై పొయిందండి.

రాను రానూ తనకంటా బలమైన ఆత్మున్న
సక్తులన్నిట్నీ
మనుసుల్రూపంలో సిత్రీకరించేసి
పూజించేయటం మొదలెట్టేసాడండి.

ఇందువుల్లో పునర్జన్మున్న్దనుకోవటం
ముస్లింలూ,క్రైస్తవుల్లో రెసరెచ్హనున్న్దనుకోవటం
ఇవన్నిటికీ ఇలాంటలోసనలే
కారన్మనుకోవచ్హండి మరి.

ఆరోజుల్లో కూడా మనిసి బల్లకిండనుంచి
లంచాలిచ్హేవోడండి.

తనకన్న బలంగా వున్న సక్తుల్ని
మెప్పించి తనక్కావలిసిన పనుల్ని
సేయించుకొవటం కోసం
ఆల్లని పూజించడం , వాటికి
జంతువుల్నదీ బలివ్వడం లాంటివి సేసేవోడండి.

పుట్టినపుడూ,పెల్లిల్లకీ,సనిపోయినపుడూ,
పంటలు నాటుతున్నపుడూ,పంటలు కోత్తున్నపుడూ,
జంతువుల్ని యేటాడుతున్నపుడూ -- ఇలా పెతీ ఇసయం లోనూ
ఏవేవో పూజలు సేసేయటం మొడలేట్టడండి.

ఇంకా యుద్దాలకి వెల్తున్నపుడు,కరువులొచ్హినపుడూ,
ఏవన్న భూకంపాలూ, వానలూ, వరదలూ
వచ్హినపుడూ దేవుల్లకి కోపం వచ్హిండేమొనని
సాంతింపసేయటానికి
పూజలూ పునస్కారాలూ సేసేవోడండి.

ఇలాంటి పనులు సెయ్యటం పెపంచకంలో
అన్నిసోట్లా తాతల తాతల తలంత్రాలనుండీ
వత్తూనే వుందండి మరి.

ఆయ్‌ అమ్మయ్‌ గోరూ
ఇంకా సెప్పాలంటే మాయలూ మంత్రజాలాల
గురించి సాలా ఉండండి.

అయ్యన్నీ మనం ఇఠలాసార్య
సినీమాల్లో సూత్తూ వుంటాం కదేటండి.
‘గులేబకావలి కత’ సినేమా
సూల్లేదేటండి మీరు?

‘చూచాను!’

ఇప్పుడుదాకా సెప్పిందంటా
‘ఎనిమిజం ’ అంటారండి.
ఈ.బీ.టెయిలరనే ఓ పెద్దమనిసి బట్టలు కుట్టనపుడల్లా
ఇలాంటివి అలోసించేవోడంటండి.

ఆయ్‌ అదండి మరి.

---------

ఆయ్‌ .అమ్మయ్‌ గోరూ..
మీకూ మీ ఇంటికాడోల్లందరికీ ఓలీ సుబా కాంచలండి !

మీరు కూడా ఇక్కడకొత్తున్నోల్లందరికీ
ఓలీ సుబాకాంచలు సెప్పేయండి మరి.

‘అందరకూ హోలీ సుభా కాంక్షలు !’

ఆయ్‌ బాబోయ్‌ .బలే సెప్పారండమ్మయ్‌ గోరూ.
నాకు అట్టా మాటాట్టం నేర్పుత్తారండి మరి ?

‘అలాగేలే .కానీ ఇంటికెల్లేటప్పటికి
నేనూ నీలా మట్టాడేత్తానేమో ,
మా ఇంటిదగ్గర నన్ను గుర్తు పట్టరేమో
నని భయంగా ఉంది! ’

ఆయ్‌ బాబోయ్‌. మీరు మరీనండి అమ్మయ్‌ గోరూ!

ఒరేయ్‌ కిట్టిగా..అట్టా సూత్తవేంటెహె.

అమ్మయ్‌ గోరికి గోదారి నీల్లూ
గట్టా కలపని సిక్కని
పాలెక్కువేసి డబల్‌ ఠ్రాంగా
పెసల్‌ టీ పట్రారా.

ఆయ్‌ . మరేనండమ్మయ్‌ గోరూ
ఇయ్యాలకూడా నా రిచ్హాకి సెలవండి.
మీకో పెసల్‌ ఇసయం సెపుదామనొచ్హానండి.

‘స్పెషల్‌ విషయమా ?! ఏమిటది ?!’

మరి మీరు టీ తాగుతూండండి.
(లేకపోతే మొన్నడ్లా మల్లీ
పారిపోతారేమోననండి .ఆయ్‌ )
ఆ ఇసయం సెపుతానండి.

‘ఊ’

మరి సెప్పాకా మీరు
నన్ను కొట్టగూడదండి మరి.

‘అలాగేలే సెప్పు మరి ’

మరేంలేదండమ్మయ్‌ గోరూ!

మా వూరి ఎమ్మెల్లేగారి యేలిడిసిన మేనమామ
అత్త కూతురి పిన్ని కొడ్కొకడు
ఈ వూల్లోనే దాన్నుం యాపారం
సేత్తున్నాడండి.

ఆయ్‌. మరి కుర్రాడెపుడూ ‘ఈరో ఓండా’
బండి మీద తిరుగుతుంటాడండి.

ఈ అబ్బాయికి రొయ్యల కూరంటే
బాగా ఇట్టమండోయ్‌.
అందుకేనండి ఆయనెపుడూ రొయ్య మీసాలు
మెంటైన్‌ సేత్తాడండి.

అబ్బాయేమో
పాత సినిమాల్లో సూత్తా ఉంటాం కాదండీ
ఆయ్‌ . గిరిబాబు గారండి.అట్టా ఉంటాడండి.

సెవులకి అయిత్తులాల బంగారం
రింగులూ,మెల్లో పులుగోరూ,
సేతికి సెయినూ..
ఆయ్‌ .అన్నీ బంగారమియ్యేనండి మరి.
ఎప్పుడూ పెట్టుకుని లుంగీతో
ఈరో ఓండా బండి మీద
సందాలమాట్లు సెరువుగట్లెమ్మట
సికారికి పోతావుంటాడండి.

మరి ఆల్లకి దాన్నుమేపారమే కాక
ఆరు పాడె గేదెలూ,మూడు గిత్తలూ
గట్టా వున్నాయండి మరి.

మరమ్మయ్‌ గోరూ మీకిట్టమయితే..

‘మ్మ్‌ ! ఆ కుర్రోడ్ని మూడు కేజీల
ఎగుర్తున్న రొయ్యల్ని పేక్‌ చేసి పట్రామను.
కూరకు మా ఇంటికి తీసుకెళ్ళాలి.సరేనా ?! ’

ఆయ్‌ బాబోయ్‌ ! అట్టాగేనండమ్మయ్‌ గోరూ !
ఇప్పుడే యెల్లి చనంలో సెప్పేసొత్తానండి !
మీరిక్కడే సెట్టుకింద కూసూనుండండి.
ఎంటనే వచ్హేత్తానండి మరి.ఆయ్‌.

ఆయ్‌.సెప్పేసొచ్హనండమ్మయ్‌ గోరూ.
ఈరో ఓండా బండి మీద రొయ్యల్ని
తెత్తానన్నాడండి.

మీరు మా సెడ్డా మంచోరండమ్మయ్‌ గోరూ
మరి నన్ను కొట్టలేదు తిట్టలేదు కదండీ !

ఆయ్‌ . మీరు ‘ఊ ’ అంటే కతలోకెల్పోదామండి మరి.

‘ఊ’

---------------------
అమ్మాయ్‌ గోరూ
మరండి,మన కత లోకి ఎల్లటానికి ముందు
మీరేమనుకోనంటే
మీకో పిట్ట కత సెప్తానండి మరి.

ఎందుకంటే నండి
ఈ రోజుల్లో ఆడాల్లు మొగోల్లలాగ
మొగోల్లు ఆడాల్లలాగా మారిపోతమేకాకుండానండి మరి
ఆల్లు సేయాల్సిన పని ఈల్లూ
ఈల్లు సేయాల్సిన పని ఆల్లూ
సేసేత్తున్నారండి

ఇదంతా సూత్తుంటే మా తాత సెప్పిన కతొకటి
గుర్తుకొత్తోందండి
మరి మీరు ‘ఊ అంటే’
ఆ కతే ఇపుడు మీకు సెఎ్దామనుకుంటున్నానండి.

సెప్పనాండి మరి అమ్మ¸్గూరూ?!

‘ఊ ఊ చెప్పు చెప్పు ! తాతగారి కథలంటే
నాకూ ఇష్టమే మరి !’

ఆయ్‌. మరయ్తే అమ్మయ్‌ గోరూ
సానా జాగత్తగా ఇనండి మరి.

అనగనగనగా ఒక ఊల్లో
సెంగప్ప అనే సాకలోడుండే వాడండి.

అమ్మయ్‌ గోరూ మీరీ కత ఇనే ఉంటారండి.
సెప్పనాండి మరి?!

‘ ఊ చెప్పు చెప్పు !’

ఆయ్‌.మరి ఆ సాకలోడు రోజూ
గాడిద మీద సాకిరేవుకి బట్టలేసికెల్లి
అక్కడయ్యన్నీ ఉతికెండారేసేవోడండి.
సందాల మల్లా ఆ గాడిది మీదే ఎండిన
బట్టలన్నీ ఇంటికి తీసుకొచ్హి ఇత్రీ సేసి
పక్కన పెట్టేవోడండి.

రాత్రికి గాడిదకు దానా పెట్టి
పెరట్లో కట్టేసేవోడండి.
ఆ సాకలోడికి ఒక కుక్క
కూడా ఉండేదండి
దాన్ని కూడా రాత్తుల్లు
దారబందం దగ్గర కట్టేసి
ఇంట్లో తాను నిద్రోయేవోడండి.

ఇలా ఆ సాకలోడు పొట్ట పోసించుకుంటూ
కాలం గడుపుతున్నాడండి.

మరమ్మాయ్‌ గోరూ ,ఎదవలోకం గదాండి మరి.
పక్కీదిలో ఉన్న మరో సాకలోడికి
మన సాకలోడంటే అంత కిట్టదండి.

ఒకరోజు పక్కీదిలో సాకలోడు
మన సాకలోడిని ఎలాగన్నా దెబ్బ తీయాలని పేనేసి
అమాస నాడు నడి రేత్తిరి కాడ
మన సాకలోడింట్లోకి దొంగతనానికని
పెరట్లోకి దూకుతాడండి.

దారబందం దగ్గర కట్టేసున్న కుక్క
ఆడ్ని సూత్తాది గాని
ఆ రోజు తనకు మాసం కూరతో
తిండెట్టలేదని అది మొరగదండి.

పక్కనే వున్న గాడిద మొరగమని
సెప్పినా ఆ కుక్క మొరగదండి మరి.

గాడిదేమో నువ్వు మొరగకపోతే నాకు
సేతకాదనుకున్నవా
ఓన్రు గారిని లేపటం అని
‘ఘీ క్కుం ! ఘీ క్కుం ! ఘీ క్కుం !ఘీ క్కుం !’
అని గాండ్రింతం మొదెలడెతాదండి.

అదిని మన సాకలోడు ఇంట్లోంచి
బయటకోచ్హేటప్పటికి
దొంగోడేమో గోడదూకి పారిపోతాడండి.

ఆయ్‌ .ఇంకేముందండి మరి.
ఈ గాడిద వొల్లు బలిసి అరుత్తోందనుకొని
దుడ్డు కర్ర తీస్కొచ్హి
గాడిదను సావ బాదేసి
సాకలోడు మల్లీ ఇంట్లోకెల్లి పడుకుంటాడండి.

పాపం గాడిదేమో
‘ నాకు బుద్దొచ్హిందిపుడు.
ఎవరు సేయాల్సిన పని ఆల్లే సేయాలి రామా! ’
అనుకుంటాదండి.

ఆయ్‌ .అమ్మ¸్గూరూ .
పిట్టకతైపోయిందండి మరి.
మనం ఇప్పుడసలు కత,
అదేనండి దుస్సంతుడూ-సకుంతలమ్మ కతలోకెల్దామండి.
మరి మీరొక ‘ఊ ’కొట్టండి.

‘ఊ’
-------------------------------
‘దేస బాసలందు ’ మొదట్నుంచీ సదవండి మరి
అంటే ఎన్మ్దో పేజీ నుండండి మరి!
----------------------
ఆయ్‌ అమ్మయిగోరూ..
రిచ్హా డబ్బులిచ్హేసినందుకు సాలా ధాంక్సందీ.
సందాల మా ఇంటిదానికి ఈ డబ్బుల్తో
మల్లెపూలు పట్టుకెల్తానండి.
లేకపోతే అది నన్ను ఇంట్లోకి రానివ్వదంది..ఒట్టండి మరి!

ఆయ్‌..మీకు ఆ పెసిడెంటు గారి సంబందం కాకపొతే మరొక సంబందం సూత్తానుగానండీ..మీరు మాత్రం అలా పారిపోకంది అమ్మయిగోరూ..

ఆయ్‌..ఇక మనం గోదారి జిల్లాల పెజలగురించి మాటాడుకుందామండి.

ఆల్లు సాలా మంచోల్లంది.
ఆ గోదారమ్మనీ, ఈ బూదేవమ్మనీ నమ్ముకు బతుకేవోల్లంది ఆల్లు.
అందుకేనంది సాలా సాంతంగా వుంటారండి.

అమ్మయిగోరూ..కునుకేయకుండా ఇనండి మరి..

అంతెందుకండి..మొన్న ఎలచ్హ ంలలో
మిగతా చోట్ల బాంబులతో కొట్టుకు సత్తే..
ఇక్కడ మాత్రం ఎదో కర్రసాముటొ సరిపెట్టుకున్నారండి..

ఆయ్బబోయ్‌ అమ్మయిగోరూ..ఇంతకీ మీరెక్కడికెల్లాలండీ??
----------------------------------
ఆయ్‌ బాబోయ్‌..
నా రిచ్హా డబ్బులివ్వకుండా
అమ్మయిగోరు అలా
ఇల్లుడిసిన బానంలా
దూసుకుపోతున్నారేటండీ..?!

అయ్యబాబోయ్‌..!
నా రిచ్హా డబ్బులండి అమ్మయిగోరు..!!
----------------------------------------------
‘అమ్మయిగోరు రిచ్హాండి..’

(అమ్మయిగారు రిక్షా ఎక్కేసారు
రిక్షా వడివడిగా రోద్దుమీద సాగుతున్నపుదు సంభాషణ..ఇలా సాగుతుంది.)

‘మరి యేవూరండి మనది?’

‘వూరా..నేను అమెరికా నుంచి వస్తున్నానయ్య..’

‘అయ్యబాబోయ్‌..వమెరికాయే.అంటే మీరు యేరుపోట్టులో దిగారన్నమాట..’

‘అవునయ్యా..రాజమండ్రి ఎయిర్పోర్టులో దిగాను’

‘మరి అమ్మయిగోరూ వమెరికాలో మీరెటిసేత్తారమ్మా?!’

‘నేనూ.. నేను అక్కడ పెద్ద విమానాల కంపెనీలో పనిచేస్తానయ్యా..’

‘మరి వమెరికాలో రిచ్హతోక్కితే బాగా కిడతాదమ్మా?’

‘ఓ.. భలే కిడతాది..డబ్బులే డబ్బులు.!’

‘మరి నెనమెరికా వచ్హేస్తానమ్మాయిగోరూ..
మీ కూడా తీసుకుపోరూ..’

‘అలాగేలే..’

‘మరక్కడ రిచ్హవోల్ల సంఘాలుంతాయమ్మగొరూ?’

‘వుంటాయయ్యా బాబూ..’

‘అమ్మయిగోరు..ఒక దౌటంది..మరేమనుకోరుగా?’

‘నేనేమనుకోనులే ఏమితొ అడుగు మరి!’

‘మరయ్యగోరు యెక్కదున్నారమ్మ..?’

‘నాకింకా పెళ్ళే కాలేదయ్యా బాబూ..’

‘మీరింకా పెల్లి సెసుకోరెంటమ్మా..నాకు దెలిసిన సంబంధమొకటుంది అమ్మయిగోరు..’

(ఈ సమయానికి అమ్మయిగారు రిక్షా దూకి పరుగో పరుగు..)


ఇది గోదావరి జిల్లల్లో రిక్షావాది తెలివితేలకు ఒక మచ్హుతునక..

చూదంది మరి..
ఎంత మర్యాదా ఎంత మర్యాదా!
--------------------------

ఆయ్‌.
గు గు గు గు గుడెసుంది
మ మ మ మ మంచముంది
హాయ్‌ గు గు గు గు గుడెసుంది
మ మ మ మ మంచముంది
గుడిసె మంచం మడిసే లేక అమ్మో అంటున్నవి అమ్మో అంటున్నవి
హ గు గు గు గు గుడెసుంది
మ మ మ మ మంచముంది
రెంటికి రాత్రికి రేటొచ్హి రైటో రటన్నవి రైటో రైటన్నవి
--------------------------------------------------------
 
హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ …
పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ..

ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ ..
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ ..

నా మనసిది .. ఓ ప్రేమనది ..
నా గుండెతడి .. నీపై వెల్లువై పొంగినది ..

హలో రమ్మంటే .. హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ …
పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ..

ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ ..
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ ..

24 కారట్ లవ్లీ ప్రేమ .. 24/7 నీపై కురిపిస్తున్న…
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్న .. every second నీకై పడి చస్తున్న..

ఏడు రంగులుగా సులువుగా…
ఏడు రంగులుగా సులువుగా… వీడి వాడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది ..
ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల రుతువై నీకొరకై .. చూస్తున్నది ..

నువ్వంటే ఇష్టమంటుంది.. సరేలమంటూ వదిలిస్తే .. తప్పేముంది ..
ఓహో హొహ్

హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ …
పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ..

ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ ..
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ ..
(RAP…)
Do we do we do we do we like that
Do we do we do we do we like this
Do we do we do we do we like that
Do we do we do we do we this
(oooooooooooo)

అందమైన కలను చూస్తూ ఉన్న ..అందులోన నేను నీతో ఉన్న ..
అంతు పొంచలేని అనందాన .. ఈ క్షణాన్ని నీకే సొంతమన ..

ఇది మనసుకి మాత్రమే తెలిసే ఫీలింగ్.. కావాలంటే చదువుకో మనసుతో ..
రంగం లాంటి నా ప్రేమ ఇది .. జీవనదిలా నిన్ను చేతులరగిమ్పెను నింపుకో ..
చెలి నువ్వెంత వద్దన్న ప్రేమగా పెరిగి పోతున్న ప్రేమలోన ఓఓ

హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ …
పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ..

ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ ..
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ ..

నా మనసిది .. ఓ ప్రేమనది ..
నా గుండెతడి .. నీపై వెల్లువై పొంగినది ..

------------------------
ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంతదాక వచ్చాక అడ్డెందుకూ లోతులోన మునిగాక ఒడ్డెందుకూ
కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకూ సరస మాడనప్పుడు సొగసెందుకూ
గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుంజం
అడు గుడు అడు గుడు గుడు గుడు లంచం ||గుడు||
చెడుగుడు చెడుగుడు గుడు ఛంఛం

కంటిలోన నలుసు తీయమన్నావు
నలుసు తీసి చంప నలపమన్నావు చెంపగిల్లి ఆగలేవు అన్నావు
పెదవి పండు ముద్దు పిండుకున్నావు
పెదవి నుండి మెడలోకి చేరుకున్నాకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా
గుండెలో జారుకుని గుట్టునే గుంజుకుని
అంతలో పుంజుకుని అదునుచూసి అదుపుదాటితే ||గుడు||
జరుగుడు జరుగుడు గుడు కొంచెం ||గుడు||
విరుగుడు విరుగుడు గుడు మంచం

కాలిలోని ముల్లు తియ్యమన్నావు
ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు
మువ్వముట్టి ముందుకెళ్లి పోయావు చీర అంచుపట్టి పైకి పాకావు
చీరలోని మూరలోని చిక్కుకున్నాక
దారి తెన్ను ఏదినాకు చిక్కకున్నాక
చెంగులే దులుపుకుని నిన్ను చేపట్టుకుని
చీరలా చుట్టుకుని చివరి వరకు కధలు నడిపితే ||గుడు||
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం ||గుడు||
తరికిట తరికిట కిట కిట తధ్యం ||ఇంత||


 - సిరి  

No comments:

Post a Comment