Thursday, February 10, 2011

అంతర్వేది శ్రీ లక్క్ష్మి నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు

అంతర్వేది శ్రీ లక్క్ష్మి నరసింహ స్వామి 
కళ్యాణోత్సవాలు

తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందినఅంతర్వేది శ్రీ లక్క్ష్మి నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు ఈ నే పది నుండి ప్రారంబంమయ్యాయి.ఈ నెల పదముడున రాత్రి ఒంటిగంట ఆరు నిముషములకు మృగశిర నక్షత్ర్హ యుక్త లగ్న మందు స్వామీ వారి కల్యాణం జరగనుందిమద్యాహ్నం1.30  నిముషం లకు రధయాత్ర జరుగును.రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా విచ్చేస్తారు.

  • మాఘ శుద్ద సప్తమి- మాఘ బహుళ పాడ్యమి - బ్రహ్మోత్సవాలు
  • మాఘ శుద్ధ దశమి- కళ్యాణం
  • మాఘ శుద్ధ ఏకాదశి భీష్మైకాశి) - రథోత్సవం
  • జేష్ఠ శుద్ధ ఏకాదశి - శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
  • వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి
దేవస్థానం చిరునామా
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము.అంతర్వేది, సఖినేటిపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఫోన్: 08862-259313.
అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం కలదు.


స్థలపురాణం

కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యం లో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయం లోసూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

క్షేత్ర నామం
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ది
ఒకానొక సమయం లో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వం తో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడు కి వశిష్ఠుడు కి ఆసమయం లో జరిగిన సమరం లో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తి ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధము ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య లో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్టమ్మ. ఈయన అంతర్వేది పరిసరాలలో ఒక జమీందారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలావిగ్రహము కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా(నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానది కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసినారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నా
 అశ్వరూడాంభిక(గుర్రాలక్క) ఆలయము
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.
అన్నా   చెళ్ళెళ్ళ గట్టు
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత
[మార్చు]సముద్రతీరం
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ది పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూ, స్వచ్చంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, లైట్ హౌస్, గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.
ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు..
 రవాణా సౌకర్యాలు
బస్సు
 అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి, కాకినాడల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరవచ్చు.విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి కలవు.
రైలు
 హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు]
వసతి సౌకర్యాలు
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ]
     



సేవలో పేస్ బుక్

సేవలో  పేస్ బుక్ 


ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా...     అదో మారు మూల గ్రామం, ఇంతవరకు ఎ ఒక్క మంత్రి కూడా వచ్చిన సందర్భం లేదు... అలంటి ఒక చిన్న ఊరికి ఒక్కసారిగా మహాభాగ్యం దక్కింది ఆ ఊరే వరంగల్ జిల్లా లోని రాయినిగూడెం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి రోచుబండ సారీ అధికార పార్టీ వారు, ప్రభుత్వ అధికారులు దీన్నే రచబండ అంటారంతా ఎవరో చెప్తే విన్నా... ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చేసిన ఖర్చు----
రాయినిగూడేనికి 35 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 18 చెక్ పోస్టుల ఏర్పాటు,
ఒక్కో చెక్ పోస్టులో 50 నుండి 60 మంది పోలీసులు,
వీరికి స్టోన్ గార్డులు, ఫైబర్ లాఠీలు, టార్చి లైట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వైర్ లెస్ సెట్లు, యంతేన్నలు, అత్యాధునిక తుపాకీలు....
ఇంకా ఒక్కో చెక్ పోస్టుకు DSP స్థాయి అధికారి నేతృత్వంలో CI , SI లు, స్పెషల్ పార్టీలు, గ్రే హౌండ్స్ దళాలకు చెందినా 50 నుండి 60 మంది పోలీసుల వాహనాలు, ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీలు ,
ముందస్తుగా ఇప్పటికే ౩౦౦మంది నియోజకవర్గ స్థాయీ తెరాస, BJP , విద్యార్థి నాయకుల అరెస్టులు ...
మొత్తంగా ప్రజల కోసం చేసే కార్యక్రమానికి ఇద్దరు అదనపు SP లు , 18 మంది DSP లు, 40 మంది CI లు, 120 మంది SI లు, ౧౦౦ మంది ప్రొబేషనరీ SI లు, 350 మంది ASI / హెడ్ కానిస్టేబుళ్లు , 1900 మంది కానిస్టేబుళ్లు, 900 మంది హోమ్ గార్డులు... ఇంకా వీరికి తోడుగా, స్పెసల్ పార్టీలు, 15 గ్యాస్ పార్టీలు..... వీరంతా మూడు రోజుల తిష్ట...తాజాగా CRPF , APSP , గ్రే హౌండ్స్ దళాలు అన్ని కలిపి సుమారు 6 వేల మంది కి పైగా పోలీసుల తిష్ట....
అవసరమా ఇంత హంగామా???
ప్రజల కోసం చేసే కార్యక్రమమే అయితే ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా...

- కిరణ్ దాసరి. 

 *********************
కిరణ్ రచ్చ బండ 
 అక్కా... సీఎం ఏం చెప్పిండే, ఏమన్న సమజైందా...
చెల్లే, ఒక్క మాటన్నా సమజైతే చెప్పుతో కొట్టు...
రెండు నిమిషాలకే ఎల్లిపోయిండు ఎందుకక్కా...
గొడవైతదని కొడుకు బుగులుపడ్డడేమోనే చెల్లే...
దరఖాస్తులేమో తీసుకుని బయట పారేసిన్రు...
మరెందుకొచ్చిండు... ఏం చెప్పనీకొచ్చిండు...
జిద్దుకొచ్చిండు... మనల్ని ఎడ్డొల్ని చేయనీకొచ్చిండు...
గిట్ల మీటింగ్ పెడితే గదేం పెద్ద తెలివా ఏంది...
పోనీ చెల్లే, వాని ఇజ్జతే పోయింది గదా, ఇగ పోదాం పా...!! 
- లహరి.
**********************************************************************************
న్ని జిమ్మిక్కులు, ఎన్ని ఎత్తుగడలు
న్ని జిమ్మిక్కులు, ఎన్ని ఎత్తుగడలు వేసినా !! ఓరుగడ్డ పోరుగడ్డగా మారి రాణి రుద్రమ దేవి లా సమ్మక్క సారక్కలుగా, ఓరుగల్లు ఆడబిడ్డలు ఆంధ్ర పాలకులకు CM కు తమ రుచి చూపిచ్చారు.
బారత చరిత్ర లోనే తొలిసారిగా తుపాకి పట్టిన పౌరిని గడ్డ ఓరుగల్లు గడ్డ.
మా... ఓరుగడ్డ వీర వనితలకు తెలంగాణ ఉద్యమ అభినందనలు .
జై తెలంగాణ
-   నిజాం రెడ్డి, ఓరుగల్లు 

‎" భూమి కోసం, భుక్తి కోసం, పరపాలన విముక్తి కోసం, జాతి, సంస్కృతి పరిరక్షణ కోసం, సామ్రాజ్యవాద దురహంకారాన్ని ఎదురిస్తూ ప్రజలు జరిపిన ఒక సుదీర్ఘ పోరాట గాధ. ప్రజలకోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన అమరుల చరిత. JAI TELANGANA JATARA "ఇది మేడారం సమ్మక్క సారలమ్మ ల జాతరే""

- గుండం  భిక్షపతి 



sevalive


సిల్లి మేటర్ - కత్తిమండ కాలక్షేపం

సిల్లి మేటర్ 
కత్తిమండ కాలక్షేపం



సరదా కబుర్లు..కాలక్షేపం బొటాని

"ప్రస్తతం నువ్వు ఏ పార్టీ లో ఉన్నావు " రంగనాధం ను అడిగాడు జోగినాధం.
"నాకు నటించడం చేతకావట్లేదు .అందుకే ఏ పార్టిలో ఉండలేకపోతున్నాను ?" చెప్పాడు రంగనాధం
"అదేమిటి మీ నాయకుడు కాంగ్రెస్ లో కలసిపోయాడు కదా !మీ జండా పీకీసారు కదా ?"
"మా నాయకుడికి నటన వచ్చు నాకు రాదూ కదా "
"మరి నువ్వు నీ నాయకుడితో వెళ్ళవా?"
"నాకు చీము ,నెత్తురు ఉన్నాయి!"
"అంటే ?.."
"నేను డబ్బుకు అమ్ముడుపోను"
"మరీ ?!"
"సామాజిక న్యాయం నినాదం నచ్చి వెళ్ళాను.బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే మెచ్చి వెళ్ళాను."
"మరి సామాజిక న్యాయం జరగలేదా ?'
"దానికర్ధం పార్టి పెట్టినోల్లకే తెలీదు'
"ఏం ?"
"పులే, అంబేద్కర్, మదర్ తెరిస్సా ఆదర్శాల అజెండా చూసి వెళ్ళాను.కాని../"
" అజెండా బాగానే ఉంది కదా!"
"అజెండా పేరు చెప్పి జెండాలను అమ్మేస్తారని నాకు ఎప్పుడే తెలిసింది"
"పరకాల మొదట్లోనే చెప్పాడు కదా!"
"నేను నమ్మలేదు.పార్టీ లో పదవిలేక అలా అన్నాడు అనికున్నాను.కాని ...వీళ్ళు చాలా .."
"ఏమిచేసారు?"
"జాతీయ నాయకులనే తాకట్టు పెట్టి డబ్బుకు అమ్ముడు ఐ పోయారు"
"నిజమంటావా?"
"నిజమా! అని మెల్లగా అంటావేమిటి లోకం కోడై కుస్తుంటే"
"నాకు నమ్మ బుద్ధి కావట్లేదు"
"డబ్బు ఎలాంటి వ్యక్తులనైన మారుస్తుంది"
"మరి ..కాంగ్రెస్లో కూడా సామాజిక న్యాయం ఉందని మీ నాయకుడు ప్రకటన లిచ్చాడు కదా!"
"బిక్ష గాడికి కాస్త ఎక్కువ భిక్షం పెడితే నిన్ను పోగుడ్తాడు తెలుసా?"
"కాంగ్రెస్ ద్వారా సామాజిక న్యాయం సాధ్యం కాదంటావా?"
"నీ బొంద !కాంగ్రెస్సే నీతి న్యాయాలు లేని పార్టీ .మరలా సామజికన్యాయమా ?"
"అదేమిటి నువ్వు చాల తెలివిగా మాటలాడుతున్నావు"
"డబ్బుల పంపకాల్లో లో కాంగ్రెస్స్ కు సామాజికన్యాయం ఉంది"
"మీ మాటలు వింటుంటే నాకు మతిపోతుంది"
"కాంగ్రెస్స్ అంతా అవినీతి, కుంభ కోణాల్లో కూరుకు పోయింది"
"మరి చిరంజీవి వారితో ఇమడగాలడా?"
"నువ్వు చాల అమాయకుడివి బ్రదర్ .ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి"
"నిజమేనండి"
"లేకపోతే... పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ అవినీతికి చిరునామా అన్న చిరంజీవి ఇప్పుడెల కలిసాడు"
"అవును నిజమే పార్టీ పెట్టిన కొత్తలో తిట్టాడు కదా!"
"తిట్టడం కాదండి .పంచెలు ఊడగోడ తానన్నారు"
"పవన్ తిట్టాడు .నిజమే!"
"మరి తిట్టుకున్నవాళ్ళు ఈ రోజు ముద్దులు పెట్టుకుంటున్నారు చూసారా?"
"రాజకీయం అంటే ఇదేనంటావా?"
"రాజకీయం లో పడక సరసం అంటే ఇదే.పగలు తిట్లు .మంచపై ఒట్లు"
"ఇంతసీన్ నేను ఉహించలేదు సుమీ!!?"
"డబ్బండి! డబ్బు!!!" .
"ఎంత డబ్బు మనిషులైతే మాత్ర్హం నీతి లేదంటారా?"
"నీతా?...పార్టీ పెట్టారు.టికెట్ల వ్యాపారం చేసారు.బాగా సంపాదించారు"
'పార్టీ కి ప్రజల ఆదరణ బాగానే ఉందికదా"
"అలా ప్రజలను నమ్మిన్చ్చారు ..భారి పధకం వేసారు."
"అవును గవర్నర్గారిని ఎందుకు కలిసారు?"
"అదంతా సినిమా హిట్ కావడానికి"
"అంటే...?"
"ఏ డైరెక్టర్ ని పెట్టి సినిమా తీస్తే సినిమా ఆడుతుందో ఆ అరవింద్ కు తెలుసు.అందుకే ఈ కలయిక"
'చాల ఉంది చరిత్ర"
"మీ మాటలు వింటుంటే నాకు నమ్మ బుద్హి కావడం లేదు'
'నిజాలు ఎప్పుడు నమ్మబుద్ధి కావులే..నాకు పని ఉంది తర్వాత మాతలాడుతా!!" అని జారుకున్నాడు రంగనాధం
నాకు తల గిర్రున తిరిగింది .

- కత్తిమండ ప్రతాప్