Friday, April 8, 2011

జిల్లాలు కాలములు

హైదరాబాద్
ఆదిలాబాద్
కరీంనగర్
నిజామాబాద్
వరంగల్
మెదక్
రంగారెడ్డి
ఖమ్మం
నల్గొండ
మహబూబ్ నగర్
 శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
కృష్ణ
గుంటూరు
ప్రకాశం
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు

 చిత్తూరు
కడప
 అనంతపురం
 కర్నూలు
రాయలసీమ
తెలంగాణా
ఉత్తరాంధ్ర
కోస్తాంధ్ర
సీమాంధ్ర
వేదిక
తెలుగుదేశం
కాంగ్రెస్
టి.ఆర్.యస్.
వై.యస్.ఆర్. కాంగ్రెస్
సి. పి. ఐసి. పి. ఎం
లోకసత్తా
ఎం. ఐ. ఎం.
లుక లుకలు
పెన్ కౌంటర్
 

 
 

 






 

  
 

 


 
 
 
 

 

 
 
 
 
 
   
 

  
 





Saturday, April 2, 2011


ఉగాదినాడు పాత బట్టలు ధరించి..

ఫాల్గున మాసం ఆరంభం రోజునుంచి ఐదురోజులపాటు వసంత ఉత్సవాలను జరుపుకోవడం టిబెట్ ప్రజలకు సంప్రదాయం. ఈ ఏడు టిబెట్ ప్రజలు పాతబట్టలు ధరించి కొత్త సంవత్సరాది ఉత్సవాన్ని జరుపుకున్నారు. క్రీస్తుశకం 2008వ సంవత్సరంలో, టిబెట్‌ఉగాది సందర్భంగా చైనా సైనికులు జరిపిన మారణకాండకు నిరసనగా ఇలా మాసిపోయిన దుస్తులను ధరించినట్టు టిబెట్ ప్రజలు చెబుతున్నారు. ఈ ఏడాదికూడ టిబెట్ ప్రజల ఉత్సవ వేదికల చుట్టూ, ఆరామాలవద్దా చైనా సైనికులు విపరీతమైన సంఖ్యలో మోహరించారు. సైనిక పాటవ ప్రదర్శనతో టిబెట్ ప్రజలను భయవిభ్రాంతికి గురిచేయాలన్నది చైనా నియంతల ఎత్తుగడ. 2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడలు జరిగినప్పటినుంచి కూడా చైనా ప్రభుత్వం ఈ ‘్భయవిభ్రాంతి’ని కొనసాగిస్తూనే ఉంది! అయినప్పటికీ టిబెట్ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమ జ్వాల చల్లారిపోవడంలేదు! ఈ నూతన వత్సర ఉత్సవాలను మన దేశంలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వం కూడ సాదాసీదాగానే జరుపుకొంది. ‘‘ఘనంగా వేడుకలను జరపడంలేదు కేవలం మత సంప్రదాయాలన పాటిస్తున్నాము’’ అని హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధినేత దలైలామా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18వ తేదీన దలైలామాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వాషింగ్టన్‌లో ఆతిథ్యం ఇవ్వడం చైనా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించిన ఘటన! దలైలామాను అమెరికా అధ్యక్షుడు కలుసుకోరాదని, కలుసుకున్నట్టయితే అమెరికా చైనా సంబంధాలు ఘోరంగా దెబ్బతింటాయని చైనా ప్రభుత్వం పదేపదే హెచ్చరికలు జారీచేసినప్పటికీ ఒబామా లెక్కచేయకపోవడం అంతర్జాతీయ వ్యవహారాలలో చైనాకు తగిలిన ఎదురుదెబ్బ! 2008 నవంబర్ నుంచి ఆవహించిన ఆర్థికమాంద్యం నుంచి బయటపడడానికి అమెరికా బ్యాంకులలో ఉన్న చైనా పెట్టుబడులు దోహదం చేస్తున్నాయట. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య వినిమయంతో చైనా భారీగా ‘మిగులు’ను సాధిస్తోంది. ఇలా మిగిలిన నిధులను చైనావారు అమెరికాలోనే పెట్టుబడులు పెడతున్నారు. అందువల్ల పెట్టుబడులను ఉపసంహరించి అమెరికాను చైనా ఇబ్బందులపాలు చేయగలదన్న ఆందోళనలు సైతం వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ దలైలామాను కలుసుకొనడానికి అమెరికా అధ్యక్షుడు నిర్ణయించడం అమెరికా ధైర్యానికి నిదర్శనం. 2008 డిసెంబర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాయ్ సర్కోజీ మారిన పాశ్చాత్య విధానానికి శ్రీకారం చుట్టాడు, పోలెండ్‌లో దలైలామాతో సమావేశమయ్యాడు. అప్పుడు చైనా అతి తీవ్రంగా ప్రతిస్పందించింది. ఫ్రాన్స్‌తోనేకాక ఐరోపా సమాఖ్యతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని చైనా నాయకులు హెచ్చరించారు! దలైలామాను టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధినేతగా ప్రపంచలోని ఏ ప్రభుత్వమూ ఇంతవరకూ గుర్తించలేదు! మన దేశంతోసహా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా టిబెట్‌పై చైనా దురాక్రమణను ఆమోదించేశాయి, టిబెట్ చైనాలో భాగమని పదేపదే ప్రకటిస్తున్నాయి! అయినప్పటికీ చైనా మాత్రం నమ్మడంలేదు. ఎందుకంటే టిబెట్ ప్రజల స్వభావం చైనాకు బాగా తెలుసు- వారు స్వాతంత్య్రం తిరిగి సాధించాలని యత్నిస్తున్నారు!
దలైలామా విధానం మారిపోయింది. ఆశ్చర్యకరంగా ప్రపంచ దేశాల విధానంలో కూడ మార్పు వస్తోంది! 1959లో దలైలామాను చైనా ప్రభుత్వం తొలగించింది. అంతవరకు స్వతంత్ర దేశంగా ఉండిన టిబెట్‌ను- ఐదు లక్షల చదరపు మైళ్ల సువిశాల ప్రాకృతిక సంపదల భాండాగారాన్ని- చైనా ఆక్రమించింది. అప్పటినుంచి టిబెట్ స్వాతంత్య్రం కోసం ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్న దలైలామా 2006లో మాట మార్చారు. తమ దేశానికి స్వాతంత్య్రం అక్కరలేదని, ప్రజల సాంస్కృతిక విలక్షణతను, ధార్మిక సంప్రదాయాలను చైనా ప్రభుత్వం కాపాడితే చాలునని దలైలామా అంటున్నారు. కానీ చైనా మాత్రం నమ్మడంలేదు. ఎందుకంటే దలైలామా విధానాన్ని టిబెట్ ప్రజలు అంగీకరించడంలేదని చైనా నియంతలకు బాగా తెలుసు! టిబెట్‌లోని ప్రజలు, ప్రవాస టిబెట్టీయులు సైతం దలైలామా ‘స్వాతంత్య్ర వ్యతిరేక’ వైఖరిని నిరసిస్తున్నారు. దలైలామాతో నిమిత్తం లేకుండా స్వాతంత్య్ర సమరాన్ని సాగిస్తున్నారు. 2008లో ఒలంపిక్ జ్యోతి వివిధ దేశాలలో ఊరేగినపుడు ప్రతిచోట వేల సంఖ్యలో టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమవీరులు నిరసనలు తెలిపారు. ఒలింపిక్ జ్యోతి బీజింగ్ చేరదని, ఒలింపిక్ క్రీడలు సజావుగా జరగవని చైనా ప్రభుత్వమే ప్రచారం చేసింది! టిబెట్ ఉద్యమాన్ని భూతద్దంలో చూపి ప్రపంచ దేశాలనుంచి పదే పదే ‘జ్యోతి’ భద్రతకు హామీలు పొందింది! తమ దేశ సమగ్రతకు హాని కల్పిస్తున్నారన్న సాకుతో దాదాపు 200 మంది టిబెట్టీయులను హత్యచేయించింది. వేలాదిమంది అరెస్టు కావడం, వారిలో కొన్ని వందలమంది జైళ్లలో మగ్గుతుండడం టిబెట్ ప్రజల స్వాతంత్య్ర నిష్ఠకు నిదర్శనం! టిబెట్ ప్రజలు ఉద్యమాన్ని ఆపకపోతే తాము ప్రవాస ప్రభుత్వ పదవినుంచి వైదొలగిపోతామని కూడ దలైలామా పదేపదే హెచ్చరించారు! ఐదు దశాబ్దుల క్రితం తమను హత్యచేయ యత్నించిన చైనా ప్రభుత్వానికి దలైలామా ఇంత గొప్పగా మద్దతు పలుకుతున్నారు. మరి చైనా ప్రభుత్వం దలైలామాను ఎందుకని వ్యతిరేకిస్తోంది??
ఇప్పుడు స్వాతంత్య్ర ఉద్యమం దలైలామా పరిధినుంచి తప్పిపోయింది. చైనా ప్రభుత్వానికి ఇది తెలుసు! టిబెట్‌లోని ప్రజలలో అత్యధికులు చైనా పెత్తనాన్ని, దుర్మార్గాన్ని ప్రతిఘటిస్తున్నారు. ఆయుధాలు లేకపోయినా, అవనీతలంలోని ఏ ప్రభుత్వపు మద్దతు కూడ లభించకపోయినా టిబెట్ ప్రజలు స్వాతంత్య్ర సమర పటిమను కోల్పోవడంలేదు. ఇప్పుడు వారు దలైలామాపై ఆధారపడిలేరు! కేవలం తమ బౌద్ధమత ప్రధాన గురువుగా ఆయనను సమ్మానిస్తున్నారు! అందువల్లనే చైనా కమ్యూనిస్టు దొరతనం బెంబేలెత్తుతోంది! అయితే టిబెట్ ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమం సాగిస్తున్నారని, 1959 పూర్వం నాటి స్థితిని కోరుతున్నారని అంగీకరించడం చైనా ప్రభుత్వానికి అవమానకరం. అంగీకరిస్తే యాబయి ఏళ్ల కమ్యూనిజం టిబెట్‌లో సుఖశాంతులను నెలకొల్పలేకపోయిందన్న సత్యాన్ని నిరూపించినట్టు కాగలదు. టిబెట్‌పై తమది దురాక్రమణ అని ఒప్పుకున్నట్టు కాగలదు. అందువల్ల టిబెట్ స్వదేశీయ ప్రజలపై ఉన్న కోపాన్ని చైనా ప్రభుత్వం వృద్ధ దలైలామా మాధ్యమంగా తీర్చుకొంటోంది! ధార్మిక విషయాలకు పరిమితమైపోయిన ఆ మత గురువును పరుష పదజాలంతో నిందిస్తోంది!
కువాయిట్‌ను , 1990వ దశకంలో, ఆక్రమించిన ఇరాక్‌ను అమెరికా దండించింది! ఇరాక్‌పై దాడిచేసి కువాయిట్‌ను విముక్తం చేసింది! ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించే పద్ధతి అంతర్జాతీయ న్యాయసూత్రాలకు వ్యతిరేకం అయినప్పుడు ఈ నియమం టిబెట్ విషయంలోను వర్తించాలి! కానీ చైనా అతిపెద్ద దేశం కనుక , విపరీతమైన సైనిక పాటవం కలిగిన అణ్వస్త్ర దేశం కనుక ఈ మాటను చెప్పడానికి, టిబెట్‌ను ఖాళీ చేయమని కోరడానికి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. సర్కోజీ ఆరంభించాడు. ఒబామా అందుకున్నాడు! కానీ, ‘టిబెట్ ప్రజల సాంస్కృతికమైన ధార్మికమైన హక్కుల పరిరక్షణ’ గురించి మాత్రమే వారు మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం గురించి ప్రస్తావించడంలేదు. ఇందుకు ప్రధాన కారణం మన ప్రభుత్వ విధానం! టిబెట్ స్వాతంత్య్రం శతాబ్దులపాటుమన దేశాన్ని చైనా దురాక్రమణ నుంచి రక్షించిన సహజకవచం! ఆ కవచానికి మనమే తూట్లు పొడిచాము. ఫలితంగా చరిత్రలో మొదటిసారిగా 1959లో మనకూ చైనాకు మధ్య అతిపెద్ద సరిహద్దు ఏర్పడిపోయింది! భారత టిబెట్ సరిహద్దు భారత చైనా సరిహద్దుగా ఏర్పడింది! నాలుగువేల కిలోమీటర్ల పొడవైన ఉత్తర సరిహద్దును కాపలా కాయడానికి 1947కు పూర్వం సైనికుల అవసరం రాలేదు. ఎందుకంటే భారత సైనిక దళాలు టిబెట్‌లో వుండేవి! చైనా దురాక్రమణనుంచి టిబెట్‌ను కాపాడే బాధ్యత ఆరోజులలో భారత్‌ది. బ్రిటిష్‌వారు నెలకొల్పిన ఈ పద్ధతి 1947 తరువాత మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు గిట్టలేదు. ‘‘టిబెట్‌లో సైనిక దళాలను నెలకొల్పే హక్కు మనకు ఎక్కడిది?’’ అని ఆయన పార్లమెంటులో ప్రశ్నించారు. అందువల్ల మన సైన్యాలను టిబెట్‌నుంచి వెనక్కి రప్పించారు. ఫలితంగా చైనా సైనికులు టిబెట్‌లోకి చొరబడి పోవడమేకాక మన దేశపు సరిహద్దుల వరకూ వచ్చేశారు. టిబెట్‌కు స్వాతంత్య్రం పోవడంవల్ల మనకు నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దును నిరంతరం కాపలా కాచేందుకు వేలాదిమంది సైనికులు అవసరమయ్యారు! 1950వ దశకంలో టిబెట్‌ను చైనా దురాక్రమించినపుడు మన ప్రభుత్వం నిరసన తెలిపి ఉంటే ప్రపంచ దేశాలు స్వరం కలిపి ఉండేవి. కానీ ఐక్యరాజ్యసమితిలోనే మనం చైనాను సమర్ధించి ప్రపంచాన్ని విస్మయంతో ముంచెత్తాము. ఇప్పుడైనా మన ప్రభుత్వం ‘‘టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండాలి’’ అని అంటే చాలు! అనేక విదేశాలు టిబెట్‌కు అండగా నిలుస్తాయి! టిబెట్ స్వతంత్ర దేశమైతే మనం ఉత్తర సరిహద్దులలో కాపలా కాయవలసిన పనిలేదు. చైనాతో మనకు సరిహద్దు తగాదా ఉండదు, సరిహద్దే ఉండదు!!

Friday, April 1, 2011

సంతానం కలగని కారణమేమిటి?

సంతానం కలగని కారణమేమిటి?

రెండేళ్ల క్రితం నా పెళ్లయ్యింది. ఇంత వరకు మాకు సంతానం కలుగ లేదు. నేను గమనిస్తే స్ఖలనంలో వస్తున్న వీర్యం చాలా తక్కువ పరిమాణం ( స్పెర్మ్ వాల్యూమ్)లో ఉంటోంది. ఇంత వరకు నా భార్యకు గర్భం రాకపోవడానికి వీర్యం తక్కువ పరిమాణంలో రావడమే కారణమా? అసలు ఎంత పరిమాణంలో ఉంటే గర్భం వస్తుందో ఆ వివరాలు తెలియచేయండి.
- ఎస్ క్రాంతికుమార్, ఇబ్రహీంపట్నం

వాస్తవానికి స్ఖలనంలో విడుదల అయ్యే వీర్యం సాధారణ ంగా 1 మి.లీ నుంచి 5 మి. లీ. దాకా ఉంటుంది. అందులో శుక్రకణాలు 40 మిలియన్ల నుంచి 120 మిలియన్ల దాకా ఉంటాయి. అయితే వీర్యం పరిమాణం మామూలుగా కన్నా ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉండ వలసిన పరిమాణం కన్నా తక్కువగా ఉంటే శుక్రకణాలు అండాశయంలోకి ప్రవేశించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక వేళ వీర్యం పరిమాణం ఎక్కువగా ఉంటే అందులో శుక్రకణాలు పలుచబారతాయి. ఇది కూడా శుక్రకణాలు అండాశయంలోకి ప్రవే శించడం కష్టమవుతుంది. అందుకే ఈ రెండు కారణాలూ గర్భం రాకుండా పోవడానికి దారి తీస్తాయి.

అయితే వీర్యం పలుచగా ఉందా ? చిక్కగా ఉందా అన్నది కాదు, వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎంత అన్నదాని మీదే సంతానం కలిగే విషయం ఆధారపడి ఉంటుంది. సహజంగా వీర్యం తె లుపు రంగులో ద్రవంలా ఉంటుంది. ఒకవేళ ఇన్‌ఫెక్షన్లు ఏమైనా ఉంటే వీర్యం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. కాస్త చెడువాసన కూడా వస్తుంది. మామూలుగా ఒక మి. లీ వీర్యంలో గర్భం రావడానికి కావలసిన మోతాదులో శుక్రకణాలు ఉంటాయి.

అయితే రతిలో పాల్గొనే సంఖ్యను బట్టి కూడా కణాల సంఖ్య మారుతూ ఉంటుంది. రోజుకు రెండు మూడు సార్లు రతిలో పాల్గొన్నప్పుడు కొందరిలో శుక్ర కణాల సంఖ్య తగ్గిపోయి గర్భం రాకుండా పోవచ్చు. ఇలాంటి వారు రతికీ రతికీ మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఇస్తే శుక్రకణాల సంఖ్య పెరిగి గర్భం వచ్చే అవకాశాలు మెరుగు పడతాయి. శుక్రకణాలు తగ్గడానికి గల ఇతర కారణాల్లో వృషణాల్లోంచి వెళ్లే నాళంలో (సెమినల్ వెసైకిల్) ఏదైనా ఆటంకం ఏర్పడటం, వేరికోసిల్ సమస్యలు, శుక్రం పరిపక్వం చెందే ఎపిడిడిమస్‌లో గడ్డలు ఏర్పడటం, స్ఖలనంలో వీర్యం వెనుదిరిగి మూత్రాశయంలోకి వె ళ్లడం (రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్) కారణమవుతాయి. అలాగే, టెస్టోస్టిరాన్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి కావడం, వృషణాల్లో ఇన్‌ఫెక్షన్లు ఉండడం, ప్రొస్ట్రేట్ గ్రంథి సమస్యలు ఇవన్నీ కారణాలే.

ఏమైనా వీర్యం తక్కువ పరిమాణంలో వస్తున్నప్పుడు సెక్సాలజిస్టును సంప్రదిస్తే స్క్రోటమ్ స్కాన్, అబ్డామినల్ స్కాన్, స్పెర్మ్ అనాలసిస్, టెసోస్ట్టిరాన్ పరీక్షల్లో ఏవో కొన్ని సూచిస్తారు. ఆ తరువాత రిపోర్టుల ఆధారంగా అవసరమైన మందులు సూచిస్తారు. మందులతో పాటు కొన్ని విటమిన్లు, మినరల్స్ కూడా తీసుకుంటే వీర్యం మోతాడు పెరుగుతుంది. ఒక వేళ వీర్యం వెళ్లే నాళాల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే చిన్న శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. చాలా మందికి ఈ సమస్యలు మందులతోనే చక్కబడతాయి,

నా వయసు 27. నాకు రతిలో పాల్లొన్న వెంటనే జననాంగం బాగా వదులైపోతుంది. ఈ కారణంగా మా వారు అసంతృప్తికి లోనవుతున్నారు. క్రమంగా ఇది అతనికి రతిలో పాల్గొనడం పట్ల ఆనాసక్తి నింపింది. నిజానికి నాలో కోరికలేమీ తగ్గలేదు. పైగా రోజురోజుకూ అధికమవుతున్నాయి. జననాంగం వదులైపోవడానికి, గల కారణాలేమిటి? ఈ సమస్యకు వైద్య చికిత్సలు ఏమైనా ఉన్నాయా ? వివరించండి.
- ఎల్ వనజ, కడప

మామూలుగా అయితే రతి ప్రారంభంలో జననాంగం వదులు కావడానికి అతిగా భావోద్వేగం పొందడమే కారణంగా ఉంటుంది. అలాగే పరస్పరం విరుద్ధమైన భావోద్వేగాలకు గురిచేసే బైపోలార్ అనే మానసిక వ్యాధిలోనూ, డిప్రెషన్‌లోనూ లైంగిక వాంఛలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక శారీరక సమస్యల్లోకి చూస్తే జననాంగంలో ఇన్‌ఫెక్షన్లు ఉండడం ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల కారణంగా కొన్ని రకాల ద్రవాలు అతిగా ఉత్పన్నమవుతాయి.

ఇది కూడా సమస్యకు కారణం కావచ్చు అయితే ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారిలో దురదతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. కొందరి స్త్రీలలో పురుష హార్మోన్లు (ఆండ్రోజన్స్) ఉండవలసిన 5 శాతం కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇవి కోరికలు అధికం కావడానికి మూలమవుతాయి. కోరికలు అతిగా ఉన్నప్పుడు సహజంగానే శరీరం అతిగా స్పందించి జననాంగం వదులు కావచ్చు. హార్మోన్ చికిత్స తీసుకుంటే ఈ పరిస్థితి చక్కబడుతుంది. కొందరిలో నాడీ వ్యవస్థ అసహజంగా స్పందించే లక్షణం ఉంటుంది.

కొందరు లైంగిక వాంఛ పెరగడానికి టెస్టోస్టిరాన్ హార్మోన్లు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే అడ్రినలిన్ గ్రంథిలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తడం, ఎపినెఫ్రిన్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం, అలాగే కార్లికో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం ఇవన్నీ కొందరిలో కోరికలను అధికం చేస్తాయి. అదే సమయంలో జననాంగం వదులు కావడానికి కూడా కారణమవుతాయి. కొందరిలో క్లోమగ్రం«థి పైన గడ్డలు ఏర్పడి ఆ కారణంగా ఇన్సులిన్, గ్లూకోగాన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి కూడా కోరికలను రెట్టింపు చేస్తాయి, కోరికలు అసహజంగా అధికం కావడానికీ, జననాంగం వదులు కావడానికి సంబంధం ఉంది. అందుకే సెక్సాలజిస్టును సంప్రదిస్తే సమస్యకు గల అసలు కారణం కనుక్కుని అవసరమైన చికిత్స సూచిస్తారు.

డాక్టర్ కుమార్ బెందాడి
సెక్సాలజి, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిపుణులు
బెన్స్ క్లినిక్, ఆర్‌టిసి క్రాస్ రోడ్
హైదరాబాద్
ఫోన్: 9849154044

Friday, February 18, 2011

సేవ ప్రత్యేకం


 ప్రముఖ హాస్య నటుడు  పొట్టి రాంబాబుతో 
సేవ బ్యూరో కత్తిమండ ప్రతాప్ ఇంటర్వ్యు





హాస్యమంటే ప్రాణం



హాస్యనటుడిగా
మంచి గుర్తింపు పొందడమే తన ధ్యేయమని
ప్రముఖ హాస్య నటుడు పొట్టి రాంబాబు అన్నారు.
పొట్టి రాంబాబుతో సేవ చిట్ చాట్ :








ప్రశ్న:       రాంబాబు గారూ! ఇప్పటి వరకు  మీరు ఎన్ని సినిమాలలో నటించారు?
జవాబు:  165  చిత్రా లలో నటించాను.
ప్రశ్న:      ప్రస్తుతం ఎ ఏ చిత్రాలలో నటిస్తున్నారు?
జవాబు:  ప్రముఖ నటుడు డాక్టర్  ఎం. మోహన బాబు తనయుడు  మంచు మనోజ్ హీరోగా 
             నటించే చిత్రం    లోను,   పవన్ కళ్యాన్ చిత్రంలో, ఇట్లు ప్రేమతో రాస్తున్న , మధుర మీనాక్షి, కోడిపుంజు,   
             గోల   తదితర చిత్రాలలో నటిస్తున్నాను.
ప్రశ్న:      మీకు కమెడియన్ లో ఎవరంటే ఇష్టం?
జవాబు:  ప్రముఖ హాస్య నటులు  డాక్టర్  బ్రహ్మనందం, ఆలి...
ప్రశ్న:      పాత తరం లో....?
జవాబు:  రేలంగి,  చార్లీ చాప్లిన్
ప్రశ్న:     మీ మొదటి సినిమా?
జవాబు : ఈశ్వర్-ప్రభాస్ హీరో
ప్రశ్న:      మీకు బ్రేక్ ఇచ్చిన చిత్రం
జవాబు : చంటిగాడు
ప్రశ్న:      హీరోయిన్ లలో ఎవరంటే ఇష్టం
జవాబు : తెలుగు హీరోయిన్ లందరు
ప్రశ్న:      మరచిపోలేని సంగటన
జవాబు : నేను సినిమాలలో నటించడం
ప్రశ్న:      ఇష్టమైన పుస్తకం
జవాబు : మిస్టర్ బీన్
ప్రశ్న:      హాస్యం కాని పాత్రలు చెయ్యరా?
జవాబు : హాస్యమంటే ప్రాణం..కామెడి విలన్ గా చెయ్యాలని ఉంది.
ప్రశ్న:      చివరగా...  ప్రేక్షకులకు,  మా పాటకులకు,  వీక్షకులకు  మీరిచ్చే సందేశం..? 
 
జవాబు : అందరు నవ్వండి.!.. నవ్వించండి!!...

kattikalam


సీనియర్ జర్నలిస్ట్ మురళి కృష్ణ మృతికి సంతాపం సోక తప్త సోక   శోకం


Thursday, February 17, 2011

అసెంబ్లీ రౌడీలు





అసెంబ్లీ రౌడీలు

సభ్య సమాజమా తలదించుకో

రౌడీలను అసెంబ్లీకి పంపినందుకు

సిగ్గు సిగ్గు అని తల వంచుకో

గూండాలకు అధికారామిచ్చినందుకు

ఓటును తాకట్టు పెట్టావు నోటుకు

రౌడీలను పంపావు అసెంబ్లీకి

కౌగిలించుకుంటారు

తిట్టుకుంటారు

కొట్టుకుంటారు

గవర్నరునే గెంటేస్తారు

దాదాగిరి చేస్తారు

కొడతారు కొట్టిస్తారు

గెంతుతారు గెంటేస్తారు

డబ్బుతో నెగ్గిన నాయకులు

వాళ్ళకేమి తెలుసు విలువలు

రాజ్యాగం పేరుచెప్పి

రాష్ట్రాన్ని అమ్మేసారు

ప్రజలు దాన్ని నమ్మేశారు

మహిళలకిచ్చిన హొం శాఖ

ఎమేస్తుంది కేక

నీరుగారిన ప్రభుత్వమా!

దిగజారిన రాజ్యాంగమ

అసెంబ్లి చరిత్రలో

ఇదో మజిలి

బ్లాక్ డే కు ఒక పేజి

వానర సైన్యం

చేస్తుంది

రావణ కాష్టం

**************************************************


ఆకలి కోసం

నా లో ఆకలి

నీ లో ఆనందం

పొట్ట కూటి కోసం  నేను

శారీరక సుఖం కోసం నువ్వు

బ్రతుకు బక్క చిక్కి నేను

బలిసిన మదం తో నువ్వు

జీవితం లో ఓటమి నాది

శరీరం లో గెలుపు నీది

నా నవ్వు ఒక విషాదం

నా లవ్వొక నాటకం

పెదాలపై ప్రేమ నాది

డబ్బు ప్రేమ నీది

నేను తాకట్టు పెట్టేది నా శరీరాన్ని

నువ్వు తాకట్టు పెట్టేది సుఖాన్ని

జనం దృష్టిలో నేను చెడ్డదాన్ని

నీ దృష్టిలో మాత్రం గొప్పదాన్ని

కాలం వెక్కిరించింది

మనసు ముకిలించింది

జీవితం జలమయమైనది

కన్నీళ్ళతో ..సోకతప్తం తో

బరువుతో బాధతో

భయం తో అర్ధాకలితో

గతిలేక

మతి పనిచేయక

స్థితి లేక

వేశ్యగా మారాను నేను

కీలు బొమ్మ నయ్యాన్నేను

నా అంతరాలు

నా అంతరంగాలు

వద్దంటున్న హెచ్చరిస్తున్న

కాలం కరిగిపోతున్న

నేను ఆరిపోతున్న

వెక్కి వెక్కి ఏడ్చినా

కన్నీళ్ళ సాక్షిగా

ఇది జీవితం కాదు

ఎవ్వరికి రాదూ

విధి ఆడించిన రాత

నా గుండె కోత

************************************************************

కలం పోటు

Power of the pen

The power of the pen

కదిలే కలం లో

మెదిలే భావాలు

అవే అక్షర రూపాలు

జీవిత సత్యాలు

రాస్తాయి నిజాలు

నీ అసత్యాల భారతాలు

పడతాయి భరతాలు

సిరా నింపిన కలం తో

జీవితం నేర్పిన పాఠం తో

అక్షరాలను

పండిస్తాడు

వండిస్తాడు
వడ్డిస్తాడు
కలం జడిపిస్తే
బెదిరింపు
కలం జులిపిస్తే
అదిరింపు
కలం విదిలిస్తే
కవ్వింపు
కలం కవ్విస్తే
ప్రేమింపు
కలం కౌగిలిస్తే
మరపింపు
కలం కాటేస్తే
వెక్కిరింపు
కలం పోటేస్తే
నీ బ్రతుకు తూట్లు
సిరాతో ...
చిరిగిన విస్తఃరి నీ పయనం

కత్తిమండ ప్రతాప్