Friday, April 1, 2011

సంతానం కలగని కారణమేమిటి?

సంతానం కలగని కారణమేమిటి?

రెండేళ్ల క్రితం నా పెళ్లయ్యింది. ఇంత వరకు మాకు సంతానం కలుగ లేదు. నేను గమనిస్తే స్ఖలనంలో వస్తున్న వీర్యం చాలా తక్కువ పరిమాణం ( స్పెర్మ్ వాల్యూమ్)లో ఉంటోంది. ఇంత వరకు నా భార్యకు గర్భం రాకపోవడానికి వీర్యం తక్కువ పరిమాణంలో రావడమే కారణమా? అసలు ఎంత పరిమాణంలో ఉంటే గర్భం వస్తుందో ఆ వివరాలు తెలియచేయండి.
- ఎస్ క్రాంతికుమార్, ఇబ్రహీంపట్నం

వాస్తవానికి స్ఖలనంలో విడుదల అయ్యే వీర్యం సాధారణ ంగా 1 మి.లీ నుంచి 5 మి. లీ. దాకా ఉంటుంది. అందులో శుక్రకణాలు 40 మిలియన్ల నుంచి 120 మిలియన్ల దాకా ఉంటాయి. అయితే వీర్యం పరిమాణం మామూలుగా కన్నా ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉండ వలసిన పరిమాణం కన్నా తక్కువగా ఉంటే శుక్రకణాలు అండాశయంలోకి ప్రవేశించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక వేళ వీర్యం పరిమాణం ఎక్కువగా ఉంటే అందులో శుక్రకణాలు పలుచబారతాయి. ఇది కూడా శుక్రకణాలు అండాశయంలోకి ప్రవే శించడం కష్టమవుతుంది. అందుకే ఈ రెండు కారణాలూ గర్భం రాకుండా పోవడానికి దారి తీస్తాయి.

అయితే వీర్యం పలుచగా ఉందా ? చిక్కగా ఉందా అన్నది కాదు, వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎంత అన్నదాని మీదే సంతానం కలిగే విషయం ఆధారపడి ఉంటుంది. సహజంగా వీర్యం తె లుపు రంగులో ద్రవంలా ఉంటుంది. ఒకవేళ ఇన్‌ఫెక్షన్లు ఏమైనా ఉంటే వీర్యం పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. కాస్త చెడువాసన కూడా వస్తుంది. మామూలుగా ఒక మి. లీ వీర్యంలో గర్భం రావడానికి కావలసిన మోతాదులో శుక్రకణాలు ఉంటాయి.

అయితే రతిలో పాల్గొనే సంఖ్యను బట్టి కూడా కణాల సంఖ్య మారుతూ ఉంటుంది. రోజుకు రెండు మూడు సార్లు రతిలో పాల్గొన్నప్పుడు కొందరిలో శుక్ర కణాల సంఖ్య తగ్గిపోయి గర్భం రాకుండా పోవచ్చు. ఇలాంటి వారు రతికీ రతికీ మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఇస్తే శుక్రకణాల సంఖ్య పెరిగి గర్భం వచ్చే అవకాశాలు మెరుగు పడతాయి. శుక్రకణాలు తగ్గడానికి గల ఇతర కారణాల్లో వృషణాల్లోంచి వెళ్లే నాళంలో (సెమినల్ వెసైకిల్) ఏదైనా ఆటంకం ఏర్పడటం, వేరికోసిల్ సమస్యలు, శుక్రం పరిపక్వం చెందే ఎపిడిడిమస్‌లో గడ్డలు ఏర్పడటం, స్ఖలనంలో వీర్యం వెనుదిరిగి మూత్రాశయంలోకి వె ళ్లడం (రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్) కారణమవుతాయి. అలాగే, టెస్టోస్టిరాన్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి కావడం, వృషణాల్లో ఇన్‌ఫెక్షన్లు ఉండడం, ప్రొస్ట్రేట్ గ్రంథి సమస్యలు ఇవన్నీ కారణాలే.

ఏమైనా వీర్యం తక్కువ పరిమాణంలో వస్తున్నప్పుడు సెక్సాలజిస్టును సంప్రదిస్తే స్క్రోటమ్ స్కాన్, అబ్డామినల్ స్కాన్, స్పెర్మ్ అనాలసిస్, టెసోస్ట్టిరాన్ పరీక్షల్లో ఏవో కొన్ని సూచిస్తారు. ఆ తరువాత రిపోర్టుల ఆధారంగా అవసరమైన మందులు సూచిస్తారు. మందులతో పాటు కొన్ని విటమిన్లు, మినరల్స్ కూడా తీసుకుంటే వీర్యం మోతాడు పెరుగుతుంది. ఒక వేళ వీర్యం వెళ్లే నాళాల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే చిన్న శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. చాలా మందికి ఈ సమస్యలు మందులతోనే చక్కబడతాయి,

నా వయసు 27. నాకు రతిలో పాల్లొన్న వెంటనే జననాంగం బాగా వదులైపోతుంది. ఈ కారణంగా మా వారు అసంతృప్తికి లోనవుతున్నారు. క్రమంగా ఇది అతనికి రతిలో పాల్గొనడం పట్ల ఆనాసక్తి నింపింది. నిజానికి నాలో కోరికలేమీ తగ్గలేదు. పైగా రోజురోజుకూ అధికమవుతున్నాయి. జననాంగం వదులైపోవడానికి, గల కారణాలేమిటి? ఈ సమస్యకు వైద్య చికిత్సలు ఏమైనా ఉన్నాయా ? వివరించండి.
- ఎల్ వనజ, కడప

మామూలుగా అయితే రతి ప్రారంభంలో జననాంగం వదులు కావడానికి అతిగా భావోద్వేగం పొందడమే కారణంగా ఉంటుంది. అలాగే పరస్పరం విరుద్ధమైన భావోద్వేగాలకు గురిచేసే బైపోలార్ అనే మానసిక వ్యాధిలోనూ, డిప్రెషన్‌లోనూ లైంగిక వాంఛలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక శారీరక సమస్యల్లోకి చూస్తే జననాంగంలో ఇన్‌ఫెక్షన్లు ఉండడం ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల కారణంగా కొన్ని రకాల ద్రవాలు అతిగా ఉత్పన్నమవుతాయి.

ఇది కూడా సమస్యకు కారణం కావచ్చు అయితే ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారిలో దురదతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. కొందరి స్త్రీలలో పురుష హార్మోన్లు (ఆండ్రోజన్స్) ఉండవలసిన 5 శాతం కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇవి కోరికలు అధికం కావడానికి మూలమవుతాయి. కోరికలు అతిగా ఉన్నప్పుడు సహజంగానే శరీరం అతిగా స్పందించి జననాంగం వదులు కావచ్చు. హార్మోన్ చికిత్స తీసుకుంటే ఈ పరిస్థితి చక్కబడుతుంది. కొందరిలో నాడీ వ్యవస్థ అసహజంగా స్పందించే లక్షణం ఉంటుంది.

కొందరు లైంగిక వాంఛ పెరగడానికి టెస్టోస్టిరాన్ హార్మోన్లు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే అడ్రినలిన్ గ్రంథిలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తడం, ఎపినెఫ్రిన్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం, అలాగే కార్లికో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం ఇవన్నీ కొందరిలో కోరికలను అధికం చేస్తాయి. అదే సమయంలో జననాంగం వదులు కావడానికి కూడా కారణమవుతాయి. కొందరిలో క్లోమగ్రం«థి పైన గడ్డలు ఏర్పడి ఆ కారణంగా ఇన్సులిన్, గ్లూకోగాన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి కూడా కోరికలను రెట్టింపు చేస్తాయి, కోరికలు అసహజంగా అధికం కావడానికీ, జననాంగం వదులు కావడానికి సంబంధం ఉంది. అందుకే సెక్సాలజిస్టును సంప్రదిస్తే సమస్యకు గల అసలు కారణం కనుక్కుని అవసరమైన చికిత్స సూచిస్తారు.

డాక్టర్ కుమార్ బెందాడి
సెక్సాలజి, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిపుణులు
బెన్స్ క్లినిక్, ఆర్‌టిసి క్రాస్ రోడ్
హైదరాబాద్
ఫోన్: 9849154044