Thursday, January 27, 2011

రాజకీయ కోడి పందాలు
-కత్తిమండ ప్రతాప్



రాజకీయ బరిలో
కాళ్ళు దువ్వుతున్న కోళ్ళు
ధమ్ములేని కోళ్ళు
దుమ్ములేపని కోళ్ళు
చేస్తున్నాయ్ జనాలను ఎర్రోల్లు
పౌరుషం లేని కోళ్ళు
పవరు లేని కోళ్ళు
కత్తి కట్టాయి
సై అంటే సై
డీ అంటే డీ
రెచ్చ గొడుతున్నాయా
రెచ్చి పోతున్నాయా
పదును లేని కత్తులు కట్టి
పాదరసం పదును పెట్టి
పద పద అంటున్నాయి
కాళ్ళు సరిలేని జగన్ కోడి
కదలలేని కిరణ్ కోడి
కాపు కాసిన చిరు కోడి
కన్నేసిన బాబు కోడి
దుమ్ములు లేని కే సి ర్ కోడి
శక్తీ లేని కమలం కోడి
కత్తికట్టాయి
సై అంటే సై
డీ అంటే డీ
దమ్ముంటే కాస్కో
వీలుంటే చూస్కో
బస్తీమే సవాల్
సి యమ్ కుర్చీ పందెం
చూడు చూడు జగన్నాటకం
రాజకీయ పితలాటకం
గెలిచినా ఓడినా
సై ఆటలో నీకు మిగిలేది మాత్రం నై

చితికిన మొగ్గలు



           చితికిన మొగ్గలు





బాల్యం బతుకు

చీకటిగా మారుతుంది

కాలం కటికి

చీకటిలా మారుతుంది

ఎంగిలి మెతుకుల కోసం వీరి నిరీక్షణ

అతుకుల బతుకులకు లేదు రక్షణ

బ్రతుకు భారం

జీవితం దుర్బరం

ఎవ్వరు చేసిన పాపం?

ఈ జీవితం.



అర్ధాకలి...అన్నార్తనాదాలు

మిన్నంటుతున్నా.....

వినిపించని పాడు లోకం

వీళ్ళకు శాపం...

చిన్నారి మొగ్గలు

చితికిన మొగ్గలు