Friday, January 28, 2011

తెలంగానం

                 తెలంగానం




  ఆత్మ వంచన వద్దురా
  ఊరిలో గొడవొస్తే డిల్లీ అమ్మను అడగాలా
  మన వీది బాగోతాలకి మోసకారి బాబుని పిలవాలా
  నాటకాలు తెలిసికూడా ఆత్మవంచన వద్దురా...
  యంతల కాళ్ళ దగ్గర చెప్పులు మోయద్దురా
  నా తల్లి తెలంగాణ తల్లడిల్లుతుందిరా
  సంకెళ్ళు తెంచుకుని తల్లి ఋణము తీర్చరా
  జరిగేది చూస్తున్నాం, ప్రతి మాటా వింటున్నాం
  ఇంటిదొంగలందరిని బజారుకీడుస్తాం
  రాజకీయ డ్రామాలకు తెరదించి దంచుతాం
  వంచించిన ప్రతి కుక్కను తరిమి తరిమి కొడతాం
  జై తెలంగాణా జై జై తెలంగాణా

            కన్నీళ దండ
  మీ తెలుగు తల్లికి మా కన్నీళ దండ
  మీ తెలుగు తల్లికి మా బతుకులే హారతులు
  కడుపులో కుట్రలు
  కనుచూపులో వివక్ష
  చిరునవ్వుతో సిరులు దోచుకొని పోయెను
  గల గల గోదారి తరలి పోతున్న
  బిర బిర కృష్ణమ్మా పరుగులెడుతున్న
  మా పంటలు మాత్రము ఎందుతాయి
  ఫ్లోరిన్ తో బొక్కలు వొంగుతాయి

బాష పేరును చెప్పి
మా బతుకులను ముంచిన
ఐదు దశాబ్దాల మీ
దోపిడి అంతం అయ్యేదాక
మా ఆటలే ఆడుతాం
మా పాటలే పాడుతాం.

నై తెలుగు తల్లి, జై తెలంగాణా
జై తెలంగాణా, జై జై తెలంగాణా.
            - టి.ఆర్.యస్. ఎన్నారై  ఫోరం