Thursday, February 10, 2011

సిల్లి మేటర్ - కత్తిమండ కాలక్షేపం

సిల్లి మేటర్ 
కత్తిమండ కాలక్షేపం



సరదా కబుర్లు..కాలక్షేపం బొటాని

"ప్రస్తతం నువ్వు ఏ పార్టీ లో ఉన్నావు " రంగనాధం ను అడిగాడు జోగినాధం.
"నాకు నటించడం చేతకావట్లేదు .అందుకే ఏ పార్టిలో ఉండలేకపోతున్నాను ?" చెప్పాడు రంగనాధం
"అదేమిటి మీ నాయకుడు కాంగ్రెస్ లో కలసిపోయాడు కదా !మీ జండా పీకీసారు కదా ?"
"మా నాయకుడికి నటన వచ్చు నాకు రాదూ కదా "
"మరి నువ్వు నీ నాయకుడితో వెళ్ళవా?"
"నాకు చీము ,నెత్తురు ఉన్నాయి!"
"అంటే ?.."
"నేను డబ్బుకు అమ్ముడుపోను"
"మరీ ?!"
"సామాజిక న్యాయం నినాదం నచ్చి వెళ్ళాను.బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే మెచ్చి వెళ్ళాను."
"మరి సామాజిక న్యాయం జరగలేదా ?'
"దానికర్ధం పార్టి పెట్టినోల్లకే తెలీదు'
"ఏం ?"
"పులే, అంబేద్కర్, మదర్ తెరిస్సా ఆదర్శాల అజెండా చూసి వెళ్ళాను.కాని../"
" అజెండా బాగానే ఉంది కదా!"
"అజెండా పేరు చెప్పి జెండాలను అమ్మేస్తారని నాకు ఎప్పుడే తెలిసింది"
"పరకాల మొదట్లోనే చెప్పాడు కదా!"
"నేను నమ్మలేదు.పార్టీ లో పదవిలేక అలా అన్నాడు అనికున్నాను.కాని ...వీళ్ళు చాలా .."
"ఏమిచేసారు?"
"జాతీయ నాయకులనే తాకట్టు పెట్టి డబ్బుకు అమ్ముడు ఐ పోయారు"
"నిజమంటావా?"
"నిజమా! అని మెల్లగా అంటావేమిటి లోకం కోడై కుస్తుంటే"
"నాకు నమ్మ బుద్ధి కావట్లేదు"
"డబ్బు ఎలాంటి వ్యక్తులనైన మారుస్తుంది"
"మరి ..కాంగ్రెస్లో కూడా సామాజిక న్యాయం ఉందని మీ నాయకుడు ప్రకటన లిచ్చాడు కదా!"
"బిక్ష గాడికి కాస్త ఎక్కువ భిక్షం పెడితే నిన్ను పోగుడ్తాడు తెలుసా?"
"కాంగ్రెస్ ద్వారా సామాజిక న్యాయం సాధ్యం కాదంటావా?"
"నీ బొంద !కాంగ్రెస్సే నీతి న్యాయాలు లేని పార్టీ .మరలా సామజికన్యాయమా ?"
"అదేమిటి నువ్వు చాల తెలివిగా మాటలాడుతున్నావు"
"డబ్బుల పంపకాల్లో లో కాంగ్రెస్స్ కు సామాజికన్యాయం ఉంది"
"మీ మాటలు వింటుంటే నాకు మతిపోతుంది"
"కాంగ్రెస్స్ అంతా అవినీతి, కుంభ కోణాల్లో కూరుకు పోయింది"
"మరి చిరంజీవి వారితో ఇమడగాలడా?"
"నువ్వు చాల అమాయకుడివి బ్రదర్ .ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి"
"నిజమేనండి"
"లేకపోతే... పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ అవినీతికి చిరునామా అన్న చిరంజీవి ఇప్పుడెల కలిసాడు"
"అవును నిజమే పార్టీ పెట్టిన కొత్తలో తిట్టాడు కదా!"
"తిట్టడం కాదండి .పంచెలు ఊడగోడ తానన్నారు"
"పవన్ తిట్టాడు .నిజమే!"
"మరి తిట్టుకున్నవాళ్ళు ఈ రోజు ముద్దులు పెట్టుకుంటున్నారు చూసారా?"
"రాజకీయం అంటే ఇదేనంటావా?"
"రాజకీయం లో పడక సరసం అంటే ఇదే.పగలు తిట్లు .మంచపై ఒట్లు"
"ఇంతసీన్ నేను ఉహించలేదు సుమీ!!?"
"డబ్బండి! డబ్బు!!!" .
"ఎంత డబ్బు మనిషులైతే మాత్ర్హం నీతి లేదంటారా?"
"నీతా?...పార్టీ పెట్టారు.టికెట్ల వ్యాపారం చేసారు.బాగా సంపాదించారు"
'పార్టీ కి ప్రజల ఆదరణ బాగానే ఉందికదా"
"అలా ప్రజలను నమ్మిన్చ్చారు ..భారి పధకం వేసారు."
"అవును గవర్నర్గారిని ఎందుకు కలిసారు?"
"అదంతా సినిమా హిట్ కావడానికి"
"అంటే...?"
"ఏ డైరెక్టర్ ని పెట్టి సినిమా తీస్తే సినిమా ఆడుతుందో ఆ అరవింద్ కు తెలుసు.అందుకే ఈ కలయిక"
'చాల ఉంది చరిత్ర"
"మీ మాటలు వింటుంటే నాకు నమ్మ బుద్హి కావడం లేదు'
'నిజాలు ఎప్పుడు నమ్మబుద్ధి కావులే..నాకు పని ఉంది తర్వాత మాతలాడుతా!!" అని జారుకున్నాడు రంగనాధం
నాకు తల గిర్రున తిరిగింది .

- కత్తిమండ ప్రతాప్

No comments:

Post a Comment