Thursday, February 10, 2011

సేవలో పేస్ బుక్

సేవలో  పేస్ బుక్ 


ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా...     అదో మారు మూల గ్రామం, ఇంతవరకు ఎ ఒక్క మంత్రి కూడా వచ్చిన సందర్భం లేదు... అలంటి ఒక చిన్న ఊరికి ఒక్కసారిగా మహాభాగ్యం దక్కింది ఆ ఊరే వరంగల్ జిల్లా లోని రాయినిగూడెం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి రోచుబండ సారీ అధికార పార్టీ వారు, ప్రభుత్వ అధికారులు దీన్నే రచబండ అంటారంతా ఎవరో చెప్తే విన్నా... ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చేసిన ఖర్చు----
రాయినిగూడేనికి 35 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 18 చెక్ పోస్టుల ఏర్పాటు,
ఒక్కో చెక్ పోస్టులో 50 నుండి 60 మంది పోలీసులు,
వీరికి స్టోన్ గార్డులు, ఫైబర్ లాఠీలు, టార్చి లైట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వైర్ లెస్ సెట్లు, యంతేన్నలు, అత్యాధునిక తుపాకీలు....
ఇంకా ఒక్కో చెక్ పోస్టుకు DSP స్థాయి అధికారి నేతృత్వంలో CI , SI లు, స్పెషల్ పార్టీలు, గ్రే హౌండ్స్ దళాలకు చెందినా 50 నుండి 60 మంది పోలీసుల వాహనాలు, ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీలు ,
ముందస్తుగా ఇప్పటికే ౩౦౦మంది నియోజకవర్గ స్థాయీ తెరాస, BJP , విద్యార్థి నాయకుల అరెస్టులు ...
మొత్తంగా ప్రజల కోసం చేసే కార్యక్రమానికి ఇద్దరు అదనపు SP లు , 18 మంది DSP లు, 40 మంది CI లు, 120 మంది SI లు, ౧౦౦ మంది ప్రొబేషనరీ SI లు, 350 మంది ASI / హెడ్ కానిస్టేబుళ్లు , 1900 మంది కానిస్టేబుళ్లు, 900 మంది హోమ్ గార్డులు... ఇంకా వీరికి తోడుగా, స్పెసల్ పార్టీలు, 15 గ్యాస్ పార్టీలు..... వీరంతా మూడు రోజుల తిష్ట...తాజాగా CRPF , APSP , గ్రే హౌండ్స్ దళాలు అన్ని కలిపి సుమారు 6 వేల మంది కి పైగా పోలీసుల తిష్ట....
అవసరమా ఇంత హంగామా???
ప్రజల కోసం చేసే కార్యక్రమమే అయితే ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా...

- కిరణ్ దాసరి. 

 *********************
కిరణ్ రచ్చ బండ 
 అక్కా... సీఎం ఏం చెప్పిండే, ఏమన్న సమజైందా...
చెల్లే, ఒక్క మాటన్నా సమజైతే చెప్పుతో కొట్టు...
రెండు నిమిషాలకే ఎల్లిపోయిండు ఎందుకక్కా...
గొడవైతదని కొడుకు బుగులుపడ్డడేమోనే చెల్లే...
దరఖాస్తులేమో తీసుకుని బయట పారేసిన్రు...
మరెందుకొచ్చిండు... ఏం చెప్పనీకొచ్చిండు...
జిద్దుకొచ్చిండు... మనల్ని ఎడ్డొల్ని చేయనీకొచ్చిండు...
గిట్ల మీటింగ్ పెడితే గదేం పెద్ద తెలివా ఏంది...
పోనీ చెల్లే, వాని ఇజ్జతే పోయింది గదా, ఇగ పోదాం పా...!! 
- లహరి.
**********************************************************************************
న్ని జిమ్మిక్కులు, ఎన్ని ఎత్తుగడలు
న్ని జిమ్మిక్కులు, ఎన్ని ఎత్తుగడలు వేసినా !! ఓరుగడ్డ పోరుగడ్డగా మారి రాణి రుద్రమ దేవి లా సమ్మక్క సారక్కలుగా, ఓరుగల్లు ఆడబిడ్డలు ఆంధ్ర పాలకులకు CM కు తమ రుచి చూపిచ్చారు.
బారత చరిత్ర లోనే తొలిసారిగా తుపాకి పట్టిన పౌరిని గడ్డ ఓరుగల్లు గడ్డ.
మా... ఓరుగడ్డ వీర వనితలకు తెలంగాణ ఉద్యమ అభినందనలు .
జై తెలంగాణ
-   నిజాం రెడ్డి, ఓరుగల్లు 

‎" భూమి కోసం, భుక్తి కోసం, పరపాలన విముక్తి కోసం, జాతి, సంస్కృతి పరిరక్షణ కోసం, సామ్రాజ్యవాద దురహంకారాన్ని ఎదురిస్తూ ప్రజలు జరిపిన ఒక సుదీర్ఘ పోరాట గాధ. ప్రజలకోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించిన అమరుల చరిత. JAI TELANGANA JATARA "ఇది మేడారం సమ్మక్క సారలమ్మ ల జాతరే""

- గుండం  భిక్షపతి 



No comments:

Post a Comment