Thursday, February 3, 2011

బలవుతున్న భక్తులు

బలవుతున్న భక్తులు

హైదరాబాద్ : దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో జరిగిన తొక్కిసలాటల్లో వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలోని వివిధ ఆలయాల్లో జరిగిన తొక్కిసలాటల్లో ఇప్పటి వరకు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ లో కృపాల్ మహరాజ్ ఆశ్రమంలోగురువారం సంభవించిన తొక్కిసలాటలో కనీసంగా 63 మంది చనిపోయారని తేలింది. అలాగే మరో 150 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.

అలాగే 2008లో సెప్టెంబర్ 30 తేదీన రాజస్థాన్ జోథ్ పూర్ లోని చాముండీ దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 వేల మంది హాజరయ్యారు. అక్కడ అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో 150 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 60 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో 2008 ఆగస్టు 3న ఉత్సవాలు జరిగినపుడు చోటుచేసుకున్న తొక్కిసలాటలో 150 మంది చనిపోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో 230 మంది వరకు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇదే ఏడాది మార్చి 27 తేదీన మధ్యప్రదేశ్ లోని కరిలా గ్రామంలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. మరో 10 మంది ఈ దుర్ఘటనలో చనిపోయారు.

2005 జనవరిలో మహరాష్ట్రలోని మంథార్ దేవీ ఆలయంలో 300 మంది వరకు మృత్యువు పాలయ్యారు. ఆలయ మెట్లపై భక్తులు జారి పడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. 2008 జూలైలో పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో రథయాత్ర జరుగుతుండగా 11 మంది మరణించారు. 2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు చనిపోయారు. 2007 అక్టోబర్ లో గుజరాత్ లోని పావాఘా లోని ఓ ఆలయంలో తొక్కిసలాట కారణంగా11 మంది మరణించారు. 2006లో పూరీలో జగన్నాధ రథయాత్రలో నలుగురు వృద్ధులు పైకి భక్తులు ఒక్కసారిగా తొసుకురావచ్చారు. తొక్కిసలాటలో చిక్కుకుని నలుగురు వృద్ధులు మృతి చెందారు. 2003లో నాసిక్ లో జరిగిన కుంభ మేలాలో 40 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 125 మంది తీవ్రంగా గాయపడ్డారు.

No comments:

Post a Comment