Sunday, January 23, 2011

మనిషి -పశువు

మనిషి -పశువు
మినీ కధ
-కత్తిమండ ప్రతాప్ .

*ఉదయమే మార్కెట్ కి వెళ్ళాను. ఒక కొట్టు దగ్గర జనం చాల రద్దీగా ఉన్నారు."ఏమిటబ్బా అంత హడావుడి "అని నేను అక్కడకు వెళ్లి చూసాను.*వరుడు లు అమ్మబడును* అని బోర్డ్ ఉంది."ఇదేమిటబ్బ ఈ టైపు మ్యారేజి బ్యురోలు కూడా వచ్చాయా "అనుకుని వివరాలు చదివాను."ఇంజనీరు -యాబై లక్షలు ,డాక్టరు -యాబై లక్షలు,ప్రభుత్వ ఉద్యోగి -పాతిక లక్షలు,"ఇలా రేటుల పట్టిక ఉంది .
మా అమ్మాయికి కూడా పెళ్లి చేసే యోచనలో ఉన్నాము కదా!మా అమ్మాయికి తగిన వరుడు రేటు ఎక్కడుంది? అని నా కళ్ళు పట్టిక వెతికాయి.పై నుండి కింద వరకు రెండు సార్లు చదివాను.నా కళ్ళు బైర్లు కమ్మాయి.నేనా రిటైర్డ్ ఉద్యోగిని ..సంసారం చాలీ చాలని జీతంతో ఈదుకోచ్చాను .పిల్ల పెళ్లి కోసమని ఏదో ఒకలక్ష రూపాయలు వరకు దాచాను.పెళ్లి ఖర్చులు పోను...కాని లక్షకు ఆ పట్టికలో " ప్రైవేటు నౌకరు -ఒకలక్షా " అని ఉంది.అంటే నేను నౌకరును లక్ష రూపాయలకు కొనాలా !.అంతకు మించి వరుడు దొరకడా?.ఛీ..ఈ లోకం ఎటు పోతుంది ?.నాకు నిజంగా ఏడుపు తన్నుకొచ్చింది.గేదెలను కట్రాడుకు కట్టి అమ్మిన్నట్టు అబ్బాయిలను అమ్ముతున్నారా అనిపించింది.పశువుకు మనిషికి పెద్ద తేడా కాని ఈ లోకం మాత్రం వెర్రితలలు వేస్తుంది అనిపించలేదు నాకు.

No comments:

Post a Comment