Sunday, January 23, 2011

ఓ మానవత్వమా నువ్వెక్కడ !?

ఓ మానవత్వమా నువ్వెక్కడ !?


ఓ ముదుసలి
బక్క చిక్కి..నక్కి నక్కి ..
గుప్పెడు మెతుకుల కోసం
ఎదురుచూస్తుంది.
తెల్లటి చెరిగిన జుట్టు
ముడతలు పడిన శరీరం
డొక్కలు వ్రేలాడుతున్న దేహం ..
బిక్కు బిక్కు మంటూ చూపులు
ఎవరైనా ...ఆదరిస్తారనే
ఎదురు చూపులు!!!
అందరు చూస్తున్నారు..?!
కాని ..??
కనికరించే మనసు
స్కార్పియో మనసులకు లేదు !
ఇండికా మను సు లకు లేదు..
టాటా సుమో జీవితాలకు లేదు.
యమహ కుర్రాళ్ళకు లేదు
సన్నీ అమ్మాయిలకు లేదు
పూజకెళ్ళుతున్న పూజారులకు లేదు..
హుండిలో డబులేసి వస్తున్న భక్తులకు లేదు!!!!
ఓ మానవత్వమా ఏది నీ చిరునామా !

-కత్తిమండ ప్రతాప్

No comments:

Post a Comment