Sunday, January 23, 2011

రాజకీయమా ...

       రాజకీయమా ...



హలో ఒక్క మాట
ప్రభుత్వం ఉందా?
ఉంది.

ఎక్కడా?
సచివాలయంలో..
ఏమిచేస్తుంది?
నిద్రపోతుంది .
ముఖ్యమంత్రి ఉన్నాడా?
ఉన్నాడు
ఎక్కడా?
పదవి కాపాడుకోవడం లో..
ఎందుకు ?
తుమ్మితే ఉడే ముక్కు కదా...
ఒహొ;
ఎందుకని?
రబ్బరు స్టాంప్ కదా...
మరి ..మరిఏ ..
రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా?
ఉందయ్యా  బాబు .
ఎక్కడా ?
మంచం మీద .
అదేమిటి?
మరి చంద్రబాబు ఉన్నదీ
మొన్నటి వరకు మంచం మీదే కదా .
పడుకున్నడా ?
అబ్బా..
ప్రతిపక్షం పడుకుంది..
నేడే సైకిలేక్కింది.
కోత్హపార్తీలు లేవా
ఉన్నాయి
ఎక్కడా ..?
మొన్న కృష్ణా నదిలో
నేడు విశాఖ తీరాన ..
అదేంటి..?
రైతులకు పిండాకూడు పెడుతున్నారు
ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు
ఎర్రజెండాలు లేవా..?
ఉన్నాయి.
మరి వాళ్ళు ...!

ఎర్రోళ్ళు ఐపోయారు
ప్రజల పేరుతో వచ్చిన పార్టీ లేదా..?
ప్రజలు లేకుండా పోయారు.
ఇంతకు మనది ఏ రాష్ట్రం....?
రావణ రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ కాదా...?
దీక్షాన్ద్రప్రదేశ్.... !


- కత్తిమండ   ప్రతాప్

No comments:

Post a Comment