Sunday, January 23, 2011

కులం రక్కసి

           కులం రక్కసి 


కులం కులం కాకుల కులం
కావాలి అందరికి ....ఆ కులం
రక్తం కక్కుకు చావడానికి/
కులం తో 'మాల'కట్టవచ్చు
ఆ 'మాల' 'మాదేగా' అనవచ్చు
చావొచ్చు ..చంపొచ్చు ..చంపుకోవచ్చు
'కాపు' కాయలేని ఈ కుల సమాజం లో
నువ్వే 'రాజు'వి ..
నువ్వే జుస్టీస్ 'చౌదరి'వి ..
నువ్వే బండేక్కే బం'డ్రేడ్డి'వి..
అందుకే కుల బండులోస్తున్నై
ఓపికుంటే ముందుకు త్రోసుకు చావండి
పదండి ముందుకు
పదండి ముందుకు
తోసుకు పోదాం కుల చక్రాలను
త్రోలుకు పోదాం
కుల చక్రాల కుతంత్రాల కింద పడి
చచ్చిపోదాం.... 
  - కత్తిమండ ప్రతాప్

No comments:

Post a Comment