Thursday, February 17, 2011

అసెంబ్లీ రౌడీలు





అసెంబ్లీ రౌడీలు

సభ్య సమాజమా తలదించుకో

రౌడీలను అసెంబ్లీకి పంపినందుకు

సిగ్గు సిగ్గు అని తల వంచుకో

గూండాలకు అధికారామిచ్చినందుకు

ఓటును తాకట్టు పెట్టావు నోటుకు

రౌడీలను పంపావు అసెంబ్లీకి

కౌగిలించుకుంటారు

తిట్టుకుంటారు

కొట్టుకుంటారు

గవర్నరునే గెంటేస్తారు

దాదాగిరి చేస్తారు

కొడతారు కొట్టిస్తారు

గెంతుతారు గెంటేస్తారు

డబ్బుతో నెగ్గిన నాయకులు

వాళ్ళకేమి తెలుసు విలువలు

రాజ్యాగం పేరుచెప్పి

రాష్ట్రాన్ని అమ్మేసారు

ప్రజలు దాన్ని నమ్మేశారు

మహిళలకిచ్చిన హొం శాఖ

ఎమేస్తుంది కేక

నీరుగారిన ప్రభుత్వమా!

దిగజారిన రాజ్యాంగమ

అసెంబ్లి చరిత్రలో

ఇదో మజిలి

బ్లాక్ డే కు ఒక పేజి

వానర సైన్యం

చేస్తుంది

రావణ కాష్టం

**************************************************


ఆకలి కోసం

నా లో ఆకలి

నీ లో ఆనందం

పొట్ట కూటి కోసం  నేను

శారీరక సుఖం కోసం నువ్వు

బ్రతుకు బక్క చిక్కి నేను

బలిసిన మదం తో నువ్వు

జీవితం లో ఓటమి నాది

శరీరం లో గెలుపు నీది

నా నవ్వు ఒక విషాదం

నా లవ్వొక నాటకం

పెదాలపై ప్రేమ నాది

డబ్బు ప్రేమ నీది

నేను తాకట్టు పెట్టేది నా శరీరాన్ని

నువ్వు తాకట్టు పెట్టేది సుఖాన్ని

జనం దృష్టిలో నేను చెడ్డదాన్ని

నీ దృష్టిలో మాత్రం గొప్పదాన్ని

కాలం వెక్కిరించింది

మనసు ముకిలించింది

జీవితం జలమయమైనది

కన్నీళ్ళతో ..సోకతప్తం తో

బరువుతో బాధతో

భయం తో అర్ధాకలితో

గతిలేక

మతి పనిచేయక

స్థితి లేక

వేశ్యగా మారాను నేను

కీలు బొమ్మ నయ్యాన్నేను

నా అంతరాలు

నా అంతరంగాలు

వద్దంటున్న హెచ్చరిస్తున్న

కాలం కరిగిపోతున్న

నేను ఆరిపోతున్న

వెక్కి వెక్కి ఏడ్చినా

కన్నీళ్ళ సాక్షిగా

ఇది జీవితం కాదు

ఎవ్వరికి రాదూ

విధి ఆడించిన రాత

నా గుండె కోత

************************************************************

కలం పోటు

Power of the pen

The power of the pen

కదిలే కలం లో

మెదిలే భావాలు

అవే అక్షర రూపాలు

జీవిత సత్యాలు

రాస్తాయి నిజాలు

నీ అసత్యాల భారతాలు

పడతాయి భరతాలు

సిరా నింపిన కలం తో

జీవితం నేర్పిన పాఠం తో

అక్షరాలను

పండిస్తాడు

వండిస్తాడు
వడ్డిస్తాడు
కలం జడిపిస్తే
బెదిరింపు
కలం జులిపిస్తే
అదిరింపు
కలం విదిలిస్తే
కవ్వింపు
కలం కవ్విస్తే
ప్రేమింపు
కలం కౌగిలిస్తే
మరపింపు
కలం కాటేస్తే
వెక్కిరింపు
కలం పోటేస్తే
నీ బ్రతుకు తూట్లు
సిరాతో ...
చిరిగిన విస్తఃరి నీ పయనం

కత్తిమండ ప్రతాప్

No comments:

Post a Comment