Wednesday, February 2, 2011

మనసా! తొందర పడకే ? 
(శృంగార కధ)

కత్తిమండ ప్రతాప్.


"మాష్టారు ..మాస్టారు "అనే పిలుపు వినిపించే సరికి వెళ్లి తలుపు తీసాను..ఎదురుగా శ్రావణి.
"మాస్టారు నాకు ఈ పరమాణు విన్యాసం అర్ధం కాలేదు కాస్త చెప్తారా " అంది లోపలి వస్తూ.
"ఆ! అలాగే "అన్నాను .నేను సోఫా లో కూర్చున్నాను.నా పక్కగా వచ్చి కూర్చుంది శ్రావణి.
శ్రావణి వాళ్ళ ఇంటిప్రక్కనే మేము అద్దెకు ఉంటున్నాము.
శ్రావణి చాల అందం గాఉంటుంది.అందుకే నాకు చాలా ఇష్టం.శ్రావణి ని చూసి నప్పుడల్లా నాలో తెలీని ఫీలింగ్స్ కలుగుతాయి.
ఆమె అందాలు నన్ను కట్టిపడేస్తాయి.
నేను తదేకం గా శ్రావణి కేసి చూడడం చూసి..
"ఇంట్లో మేడం గారు లేరా " అనడిగింది శ్రావణి.
"లేదు ఊరుకెళ్ళింది .వారం రోజుల వరకు రాదూ అన్నాను.
"అబ్బో వారం రోజులా ..ఒంటరిగా ఎలా ఉండగలరు "
"తోడుగా నువ్వున్నావు కదా !"చిలిపిగా అన్నాను.
"మీకేదైనా అవసరం ఐతే పిలవండి వస్తాను " అంది.
నీ అవసరమే ఉంది! " అన్నాను
ఏమిటో చెప్పండి?"
"తర్వాత చెప్తానులే " అన్నాను
"నీకు అర్ధం కానిది ఏ పాఠం " అడిగాను
శ్రావణి సోఫాలో దగ్గరగా జరిగింది.
"ఈ పరమాణు విన్యాసాలు సరిగా అర్ధం కావడం లేదండి '' అంది.
"ఓ! ఇవా చాల ఈజీ. "అని కావాలనే శ్రావణి భుజం మీద చేయ్యేసాను
.శ్రావణి కొంచం అసహనం గా కదిలింది.
కాని నాలో ఏదో తెలీని స్పర్శ అనిపించింది.శ్రావణి ని తాకాలనే ఫీలింగ్ ఎక్కువైంది.
నా మనసులో ఏవో ప్రకంపనాలు!!.గుండె వేగం ఎక్కువైంది!!!.
పాఠం చెప్పాను కాని ,నా మనసు మనసులో లేదు.
పిజిక్స్ పాఠం లా నా మదిలో పరమాణు విస్పోటనం జరిగినట్టనిపించింది.
'సరే మాస్టారు వస్తాను.థాంక్ యూ" అని చెప్పి వెళ్లిపోయింది శ్రావణి
శ్రావణి అందం ఎప్పటినుంచో నన్ను పిచ్చేక్కిస్తుంది.ఆమె అందాన్ని దోచుకోవాలనే కోరిక ఉంది.
కాని అవకాశం కుదరలేదు. ధైర్యం చాలా లేదు.
"ఒకవేళ కాదంటే ?..ఐనా ఒక లెక్చరర్ గా ఇలా చేస్తే నా పరువు పోతుంది."
అలా కాకుండా శ్రావణి ని ఏదో విధం గా బుట్టలో వేసుకోవాలి.
నా ఆలోచనలకు అంతే లేకుండా పోయింది!.
శ్రావణి కలవరింత నాకు పులకరింతలా అనిపించింది.
**** **** ***** ***** ****

రాత్రి మంచం మీద పడుకుని తుంటరిగా ఆలోచనలు తరుము కొస్తున్న తరుణంలో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది.
ఈ సమయం లో "ఎవరబ్బా ?' అనుకుని వెళ్లి తలుపు తీసాను.
నా కళ్ళల్లో కోటికాంతులు ఒకే సారి వెలిగాయి.నా కళ్ళను నేను నిజంగా నమ్మలేకపోయాను.
ఎదురుగా గుమ్మంలో ఉల్లిపొరలాంటి తెల్లటి నైటి లో శ్రావణి.
నాకళ్ళు ఆత్రం గా ఆమె అందాలును వెతక సాగాయి.
నై టీ లో ఇమడలేని ఆమె అందాలు నన్ను మత్హేక్కిస్తున్నాయి
"శ్రావణి ఈ టైం లో నువ్వూ......?"
'ఏం రాకూడదా ?"
'అలా అనికాదు.?"
"మా అక్కయ్య ఊరు వెళ్ళింది కదా!.మీకు కంపెని ఇద్దామని వచ్చా!"అని లోపలి వచ్చింది.
ఆ మాట వినేసరికి నా హృదయం లో కోరికల గుర్రాలు కళ్ళేలూ తెంచుకున్నాయి.
నా అంతులేని ఆలోచనలకు అంతు దొరికింది అనుకున్నాను.ఉహాలు పెట్రేగిపోయాయి.
కోరికల రెక్కలు తెంచుకున్నాయి.
"శ్రావణి నువ్వంటే నాకు చాల ఇష్టం"
"నిజంగానా?"
'రియల్లీ" తన చేతులను నా చేతుల్లోకి తీసుకున్నాను.
వెచ్చని స్పర్శ నా నరాలును తాకింది.నాలో ఉహాలు సముద్ర కెరటాలులా కేరింతలు కొట్టాయి.
నెమ్మదిగా ఆమె చేతులను నలిపాను.
"చిలిపి"చిలిపిగా అంది శ్రావణి.
శ్రావణి అందాలను తనివితీరా జుర్రుకోవాలనే కోరిక నాలో మన్మధ భాణం లా గుచ్చుకుంది.
ఎత్హైన అధరాలు.అందాలు .......రెండు చేతుల్లో ఇముడు పోయే సన్నని నడుము....
పాలరాయి లాంటి నున్నని పొట్ట.....మత్హేక్కించే నాబి,
కవ్వించే కళ్ళు...విరబూసిన కురులు..
శ్రావణి ని దగ్గరకు తీసుకుని నా బిగి కౌగిలిలో బంధించాను.
శ్రావణి నన్ను గట్టిగా హత్తుకుంది.
ఇలా ఒకరినొకరు తనివితీరా మంచం పై కౌగిలిలో ఎంత సేపు ఉన్నామో తెలీదు.
నా నరనరాల్లో జివ్వుమనే స్పర్శ ...నన్ను నేను మర్చిపోయాను.
ఏకాంతం లో ఇద్దరం !!
ఇంతలో నా తల మీద ఎవ్వరో కొట్టిన్నట్టు అనిపించింది..నా తలకు బలమైన దెబ్బ తగిలింది.
కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద నుండి కింద పడ్డాను,నా కౌగిలిలో తలదిండి.
అప్పుడు అర్ధం ఐంది.నాకు వచ్చింది కల అని?!.
"చ!" మంచి కల పాడుఐంది అనుకున్నాను. ఇది నిజం ఐతే ఎంత బాగుండును అన్పించింది.మంచి కలలో నా తల బాధ తెలీయలేదు.
***** ************ ********** ***** ***********
ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేవడానికి ప్రయత్నించాను .లేవలేక పోయాను.
ఒకటే తల పోటు,విపరీతమైన జ్వరం.తట్టుకోలేని చలి.
"అబ్బా ! సడన్ గా ఏమిటబ్బా ?'"
తల గిర్రున తిరిగి పోతుంది.
టైం ఉదయం పది కావొస్తుంది.
ఎవరైనా వస్తే బాగుండును అనుకున్నాను.
ఇంతలో శ్రావణి వచ్చింది.
"మాస్టారు ఏమిటి ఇంకా లేవలేదా?"
సమాధానం ఇవ్వలేకపోయాను .చలి చంపేస్తుంది.
నన్ను చూసి శ్రావణి కంగారు పడింది.
"ఏమైన్దండి? "
మాటలాడటానికి ప్రయత్నించాను .గొంతు సహకరించలేదు.
దగ్గరకు వచ్చింది.నొసటి మీద చెయ్యేసి చూసింది.
"అయ్యో !ఇలా కాలిపోతున్దేమిటి?"
"ఉండండి ఇప్పుడే వస్తా" అని పరిగెత్తుకుని వాళ్ళ ఇంటికేల్లింది..
వెంటనే వచ్చింది. టాబ్లేట్ ,కాఫీ తెచ్చింది.
"మాస్టారు పైకి లేచి ఈ టాబ్ లేట్ వేసుకోండి.వేడిగా కాఫీ త్రాగండి"
లేవడానికి ప్రయత్నించాను.లేవలేకపోయాను.
శ్రావణి దగ్గరకొచ్చి లేపింది.కళ్ళు తిరిగాయి.వాంతి చేసుకున్నాను ..శ్రావణి తనచేతులు దోసిలుగా పట్టింది.శ్రావణి చేతుల్లో వాంతి చేసుకున్నాను.
శ్రావణి ని చూసి నాకు ఏడుపు వచ్చింది.శ్రావణి లో నాకు అమృతమూర్తి కనిపించిది.నా మీద నాకే అషహ్యం వేసింది.
"ఛీ " నేను ఇంత దుర్మార్గుడినా అనిపించింది.
శ్రావణి అన్ని శుభ్రం చేసింది.
కాఫీ తాగిన తర్వాత రిలాక్ష్ అనిపిచింది.
'శ్రావణి రాకపోతే చనిపోదునేమో!" అనే ఫీలింగ్ కలిగింది.
శ్రావణి మరల వస్తానని చెప్పి వెళ్ళింది.
శ్రావణి నాకన్నా చిన్నదైనా రెండు చేతులు జోడించి నమస్కరించాను.
గురువుగా నా తప్పుడు ఆలోచనలకు క్షమాబిక్ష కల్పించమని ఆ దేవుడిని ప్రార్ధించాను.
నా తప్పుడు ఉహలకు సిగ్గు పడ్డాను.తల వంచాను.తల దించాను.

No comments:

Post a Comment