Saturday, February 19, 2011
Friday, February 18, 2011
సేవ ప్రత్యేకం
సేవ బ్యూరో కత్తిమండ ప్రతాప్ ఇంటర్వ్యు
హాస్యమంటే ప్రాణం
హాస్యనటుడిగా
మంచి గుర్తింపు పొందడమే తన ధ్యేయమని
ప్రముఖ హాస్య నటుడు పొట్టి రాంబాబు అన్నారు.
పొట్టి రాంబాబుతో సేవ చిట్ చాట్ :
మంచి గుర్తింపు పొందడమే తన ధ్యేయమని
ప్రముఖ హాస్య నటుడు పొట్టి రాంబాబు అన్నారు.
పొట్టి రాంబాబుతో సేవ చిట్ చాట్ :
ప్రశ్న: రాంబాబు గారూ! ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలలో నటించారు?
జవాబు: 165 చిత్రా లలో నటించాను.
ప్రశ్న: ప్రస్తుతం ఎ ఏ చిత్రాలలో నటిస్తున్నారు?
జవాబు: ప్రముఖ నటుడు డాక్టర్ ఎం. మోహన బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా
నటించే చిత్రం లోను, పవన్ కళ్యాన్ చిత్రంలో, ఇట్లు ప్రేమతో రాస్తున్న , మధుర మీనాక్షి, కోడిపుంజు,
గోల తదితర చిత్రాలలో నటిస్తున్నాను.
ప్రశ్న: మీకు కమెడియన్ లో ఎవరంటే ఇష్టం?
జవాబు: ప్రముఖ హాస్య నటులు డాక్టర్ బ్రహ్మనందం, ఆలి...
ప్రశ్న: పాత తరం లో....?
జవాబు: రేలంగి, చార్లీ చాప్లిన్
ప్రశ్న: మీ మొదటి సినిమా?
జవాబు : ఈశ్వర్-ప్రభాస్ హీరో
ప్రశ్న: మీకు బ్రేక్ ఇచ్చిన చిత్రం
జవాబు : చంటిగాడు
ప్రశ్న: హీరోయిన్ లలో ఎవరంటే ఇష్టం
జవాబు : తెలుగు హీరోయిన్ లందరు
ప్రశ్న: మరచిపోలేని సంగటన
జవాబు : నేను సినిమాలలో నటించడం
ప్రశ్న: ఇష్టమైన పుస్తకం
జవాబు : మిస్టర్ బీన్
ప్రశ్న: హాస్యం కాని పాత్రలు చెయ్యరా?
జవాబు : హాస్యమంటే ప్రాణం..కామెడి విలన్ గా చెయ్యాలని ఉంది.
ప్రశ్న: చివరగా... ప్రేక్షకులకు, మా పాటకులకు, వీక్షకులకు మీరిచ్చే సందేశం..?
జవాబు : అందరు నవ్వండి.!.. నవ్వించండి!!...
Thursday, February 17, 2011
అసెంబ్లీ రౌడీలు
అసెంబ్లీ రౌడీలు
సభ్య సమాజమా తలదించుకో
రౌడీలను అసెంబ్లీకి పంపినందుకు
సిగ్గు సిగ్గు అని తల వంచుకో
గూండాలకు అధికారామిచ్చినందుకు
ఓటును తాకట్టు పెట్టావు నోటుకు
రౌడీలను పంపావు అసెంబ్లీకి
కౌగిలించుకుంటారు
తిట్టుకుంటారు
కొట్టుకుంటారు
గవర్నరునే గెంటేస్తారు
దాదాగిరి చేస్తారు
కొడతారు కొట్టిస్తారు
గెంతుతారు గెంటేస్తారు
డబ్బుతో నెగ్గిన నాయకులు
వాళ్ళకేమి తెలుసు విలువలు
రాజ్యాగం పేరుచెప్పి
రాష్ట్రాన్ని అమ్మేసారు
ప్రజలు దాన్ని నమ్మేశారు
మహిళలకిచ్చిన హొం శాఖ
ఎమేస్తుంది కేక
నీరుగారిన ప్రభుత్వమా!
దిగజారిన రాజ్యాంగమ
అసెంబ్లి చరిత్రలో
ఇదో మజిలి
బ్లాక్ డే కు ఒక పేజి
వానర సైన్యం
చేస్తుంది
రావణ కాష్టం
**************************************************ఆకలి కోసం
నా లో ఆకలి
నీ లో ఆనందం
పొట్ట కూటి కోసం నేను
శారీరక సుఖం కోసం నువ్వు
బ్రతుకు బక్క చిక్కి నేను
బలిసిన మదం తో నువ్వు
జీవితం లో ఓటమి నాది
శరీరం లో గెలుపు నీది
నా నవ్వు ఒక విషాదం
నా లవ్వొక నాటకం
పెదాలపై ప్రేమ నాది
డబ్బు ప్రేమ నీది
నేను తాకట్టు పెట్టేది నా శరీరాన్ని
నువ్వు తాకట్టు పెట్టేది సుఖాన్ని
జనం దృష్టిలో నేను చెడ్డదాన్ని
నీ దృష్టిలో మాత్రం గొప్పదాన్ని
కాలం వెక్కిరించింది
మనసు ముకిలించింది
జీవితం జలమయమైనది
కన్నీళ్ళతో ..సోకతప్తం తో
బరువుతో బాధతో
భయం తో అర్ధాకలితో
గతిలేక
మతి పనిచేయక
స్థితి లేక
వేశ్యగా మారాను నేను
కీలు బొమ్మ నయ్యాన్నేను
నా అంతరాలు
నా అంతరంగాలు
వద్దంటున్న హెచ్చరిస్తున్న
కాలం కరిగిపోతున్న
నేను ఆరిపోతున్న
వెక్కి వెక్కి ఏడ్చినా
కన్నీళ్ళ సాక్షిగా
ఇది జీవితం కాదు
ఎవ్వరికి రాదూ
విధి ఆడించిన రాత
నా గుండె కోత
************************************************************కలం పోటు

కదిలే కలం లో
మెదిలే భావాలు
అవే అక్షర రూపాలు
జీవిత సత్యాలు
రాస్తాయి నిజాలు
నీ అసత్యాల భారతాలు
పడతాయి భరతాలు
సిరా నింపిన కలం తో
జీవితం నేర్పిన పాఠం తో
అక్షరాలను
పండిస్తాడు
వండిస్తాడు
వడ్డిస్తాడు
కలం జడిపిస్తే
బెదిరింపు
కలం జులిపిస్తే
అదిరింపు
కలం విదిలిస్తే
కవ్వింపు
కలం కవ్విస్తే
ప్రేమింపు
కలం కౌగిలిస్తే
మరపింపు
కలం కాటేస్తే
వెక్కిరింపు
కలం పోటేస్తే
నీ బ్రతుకు తూట్లు
సిరాతో ...
చిరిగిన విస్తఃరి నీ పయనం
కత్తిమండ ప్రతాప్
Wednesday, February 16, 2011
Tuesday, February 15, 2011
Monday, February 14, 2011
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఉత్సవాలు
రంగ రంగ వైభవంగా
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి
ఉత్సవాలు
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి రధోత్సవం సోమవారం బీష్మఏకాదశి పర్వదినాన కనుల పండుగగా జరిగింది.స్వామీ వారిని అమ్మ వార్లను పెళ్లి అలంకరణలతో రధం పై అలంకరించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. తన సోదరి గుర్రలక్క గుడి వద్దకు ఈ యాత్ర సాగింది. అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరిగాయి.లక్షలాధి సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.గోవింద నామ స్మరణతో అంతర్వేది పరవశించింది .రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ , జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ వేణుగోపాల్, ఆలయ చైర్మెన్ రాజ బహద్దూర్ , కార్య నిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.
స్వామివారికి పూజలు చేస్తున్న మహిళా భక్తులు
ఏనుగు వాహనపై ఊరేగే
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారలు.
కనులవిందుగా
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి రధోత్సవం
స్వామి వార్లను దర్శించుకోనేందుకు క్యులైన్లలో భక్తులు
ఉత్సవాలను తిలకించేందుకు
జాగరణ చేస్తున్న భక్తులు.
స్వామివారి ఉత్సవం కోసం ఎదురు చూస్తున్న
వేలాది మంది భక్తులు.
Subscribe to:
Posts (Atom)