Wednesday, January 26, 2011

స్వతంత్రమా ?



            స్వతంత్రమా ?

                                                     -కత్తిమండ ప్రతాప్




స్వాతంత్ర్యమా ఎక్కడున్నావమ్మా!
తెల్లజాతి చట్టాలన్నీ నీ చుట్టాలు చేసుకొని
స్వార్ధం పెంచుకున్నవమ్మా!
నరజాతి చరిత్ర సమస్తం రక్తచరిత్రగా
మారుస్తున్నవా!
కుళ్ళిన కులాల కొట్లాటలతో
మతిలేని మతాల రణరంగాలతో
ఎటు పోతున్నవమ్మా
నల్లజాతి పాలన నల్లగానే ఉందమ్మా
ఓ సంపూర్ణ స్వతంత్రమా!!!
ఆకలి బాధలు తీర్చగలవా
రైతుల కస్టాలు మార్చగలవా
ఒకపక్క నిరుద్యోగం
మరోపక్క బేవార్సు యోగం
ఓ గణతంత్రమా!
నీవు వేడుకలకే పరిమితమా
మేర భారత కి జై అంటే ..
భారత భూమి సౌభాగ్యం మాటేమిటి
కూడులేని పేదోల్లు
కొట్లున్న పెద్దోళ్ళు
నల్లజాతి నల్లధనమా
ఓ గణతంత్రమా!
భరతభూమిలో
ఈ తంత్రాలు ఏంటి !!!?

No comments:

Post a Comment